DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దుర్గా గుడి కి నిధుల మంజూరుపై మంత్రి సమీక్ష

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జూన్ 02, 2021 (డిఎన్ఎస్):* శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ నకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు దేవస్థానము అభివృద్ది దృష్ట్యా 70.00 కోట్లు మంజూరు చేసిన అభివృద్ది పనులపై దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాస

రావు సమావేశము జరిపియున్నారు. దీనిలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ వారు, శ్రీ డి.వి.భాస్కర్, కార్యనిర్వహక ఇంజనీరు మరియు సంబందిత ఇంజనీరింగు సిబ్బంది పాల్గొన్నారు. 

అభివృద్ది పనులు అనగా అన్నదాన భవనసముదాయము, ప్రసాదముల తయారీ విభాగము, స్కాడా, శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ది పనులు, కొండచరియలు

విరిగపడకుండా భద్రత పనులు, కేశఖండనశాల బిల్డింగ్ మొదలగు అభివృద్ది పనులు గురించి చర్చించి అందుకు సంబందించిన ప్లానులు పరిశీలించి 15 రోజులలో పూర్తి వివరములు సమర్పించవలసినదిగా సంబందిత ఇంజనీర్లకు ఆదేశములు జారీచేశారు. అందుకు సంబందించిన వివిధ శాఖల వారితో సమన్వయము చేసుకొని జూన్ నెల చివరలో సంబందించిన శాఖల వారితో

సమావేశము ఏర్పాటు చేయవలసినదిగా సూచనలు జారీచేసారూ. 
భక్తులకు కావలసిన కనీస సౌకర్యములు శ్రీ అమ్మవారి ఆలయము నందు చేయవలసిన మార్పులు, భక్తులకు అందుబాటులో ఉండు విధముగా కుమ్మరిపాలెం సెంటరు నందు గల దేవస్థానము వారి స్థలములో పార్కింగ్, కళ్యాణమండపములు, డార్మిటరీ హాల్స్ మరియు రూములు ఏర్పాటుకు తగిన చర్యలు

తీసుకొనవలసినదిగా సూచనలు జారీచేసియున్నారు. దేవస్థానము నందు ప్రతిరోజు జరుగు ఆర్జితసేవలు జరిపించుటకు సరియైన మండపములు లేకపోవుటవలన భక్తులు సౌకర్యం దృష్ట్యా  పూజ మండపములు ఏర్పాటుకు కావలసిన చర్యలు తీసుకొని వెంటనే ప్లాన్లు , అంచనాలు సమర్పించవలసినదిగాను, శ్రీ అమ్మవారి దర్శనార్ధం విచ్చేయు భక్తులకు సరియైన పార్కింగ్

లేక ఇబ్బందులు పడుచున్నారని అందుకు కావలసిన మల్టీస్టోరీడ్ పార్కింగ్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకొనవలసినదిగాను సూచనలు చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam