DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో 20  మంది సీనియర్, జూనియర్ ఐఏఎస్ ల బదిలీ

*కృష్ణ కలెక్టర్ గా నివాస్, అనంత కలెక్టర్ గా నాగలక్ష్మి* 
 
*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జూన్ 04, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో పలు సీనియర్, జూనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. అత్యంత కట్టుదిట్టంగా భాద్యతలు నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డా. జె. నివాస్ ను కృష్ణ జిల్లా కలెక్టర్

గా బదిలీ చేసారు. ఆ స్థానంలో ఉన్న మహ్మద్ ఇంతియాజ్ ను మైనార్టీ సంక్షేమ శాఖా స్పెషల్ సెక్రటరీ గాను, ఆపెరల్స్ డైరెక్టర్ గా పూర్తి బాధ్యతలు ఇచ్చారు. 

ఏపీ ఆగ్రోస్ విసిగా ఉన్న ఎల్ బాలాజీ రావు ను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేసారు. 
అనంతపురం కలెక్టర్గా ఉన్న గంధం చంద్రుడు ను విలేజ్ వార్డ్ సచివాలయ

డైరెక్టర్ గా బదిలీ చేసారు.

ఏపీఈపీ డీసీఎల్ చైర్ పర్సన్ గా ఉన్న ఎస్. నాగలక్ష్మి ని అనంతపురం జిల్లా కలెక్టర్ గా నియమించారు. 

విశాఖ జిల్లా పాడేరు సబ్ కలెక్టర్ గా ఉన్న డా. ఎస్. వెంకటేశ్వర్లు ను చిత్తూరు జిల్లా హోసింగ్ జెసి గా బదిలీ చేసారు.

అనంతపురం సబ్ కలెక్టర్ గా ఉన్న టి. నిశాంతి ని అనంతపురం

 హోసింగ్ జేసీగా బదిలీ చేసారు. 

గూడూరు సబ్ కలెక్టర్ గా ఉన్న రోణంకి గోపాలకృష్ణ ను విశాఖ జిల్లా పాడేరు ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారిగా బదిలీ చేసారు.

నరసాపురం సబ్ కలెక్టర్ గా ఉన్న కె ఎస్ విశ్వనాథన్ ను ప్రకాశం హోసింగ్ జేసీగా బదిలీ చేసారు. 

విజయవాడ సబ్ కలెక్టర్ గా ఉన్న ధ్యాన్ చంద్ర ను కడప

జిల్లా హోసింగ్ జేసీగా బదిలీ చేసారు.  
 
మదనపల్లి సబ్ కలెక్టర్ గా ఉన్న ఎం. జాహ్నవి ని తూర్పు గోదావరి హోసింగ్ జెసిగాను, 
విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ గా ఉన్న ఎం. మౌర్య ను కర్నూల్ జిల్లా హోసింగ్ జెసి గాను,
నర్సరావుపేట సబ్ కలెక్టర్ గా ఉన్న ఎస్ నుపుర్ అజయ్ కుమార్ ను కృష్ణ జిల్లా హోసింగ్

జెసిగాను, 

రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ గా ఉన్న అనుపమ అంజలి ని గుంటూరు హోసింగ్ జెసిగాను,

పార్వతీపురం సబ్ కలెక్టర్ గా ఉన్న విదేహ ఖరే ను నెల్లూరు హోసింగ్ జెసిగాను, 

టెక్కలి సబ్ కలెక్టర్ గా ఉన్న గనోరే సూరజ్ ధనంజయ్ ను  పశ్చిమ గోదావరి జిల్లా హోసింగ్ జెసిగాను, 

నంద్యాల సబ్

కలెక్టర్ గా ఉన్న కల్పనా కుమారి ని విశాఖపట్నం జిల్లా హోసింగ్ జెసిగాను, 

తెనాలి సబ్ కలెక్టర్ గా ఉన్న కె. మయూర్ అశోక్ ను విజయనగరం హోసింగ్ జెసిగాను, 

అమలాపురం సబ్ కలెక్టర్ గా ఉన్న హిమాంశు శుక్ల నుం శ్రీకాకుళం హోసింగ్ జెసి గాను 

కోపరేటివ్స్ అడిషనల్ రెజిస్ట్రర్  ఎస్. కృష్ణ మూర్తి ని

ఆగ్రోస్ విసిగాను బదిలీ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam