DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం కి విహెచ్పి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వితరణ 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 10, 2021 (డిఎన్ఎస్):* కోవిడ్ మహామ్మారి నేపథ్యంలో  సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ) ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించింది. వీహెచ్పీ నాయకుడు పూడిపెద్ది శర్మ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను దేవస్థానం ఈఓ ఎంవి సూర్యకళకు

అందించారు. దీన్ని దేవస్థానం సిబ్బందికోసం వినియోగించాలని శర్మ కోరారు. ఈఓ కోరికమేరకు ఒక మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకోసం సమాలోచనలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ మహమ్మారి నేపథ్యంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరం చాలా అవసరమని ఇందుకోసం దాతలను సంప్రదించామని దేవస్థానం ఈఓ సూర్యకళ తెలిపారు. విశ్వ హిందూ పరిషత్

ముందుకొచ్చి ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించినందుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.  దేశవ్యాప్తంగా 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు డొనేట్ చేశామని... VHP నాయకులు టీపీవీ రావు, జీ. సుబ్రమణ్యం, మీసా రవీంద్ర కృషివల్ల విశాఖపట్నానికి మూడు వచ్చాయని పూడిపెద్ది శర్మ చెప్పారు.  ఈ మూడింటిలో రెండు ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న కోవిడ్

సెంటర్లకు అందించామని ఒకటి సింహాచలం దేవస్థానం కోసం ఇచ్చామని చెప్పారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam