DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సినిమా షూటింగ్లు లేక స్ట్రీట్ వెండార్ గా. .జూ. ఆర్టిస్ట్ జీవనం

*భాగ్యనగర వీధుల్లో జూనియర్ ఆర్టిస్ట్ జీవన భారం* 

*ఆర్థిక ఇబ్బంది ఉన్నాసరే ఆత్మాభిమానం గానే జీవనం.*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 11, 2021 (డిఎన్ఎస్):* సినీ రంగంలో నిలదొక్కుకోవాలంటే ఎంతో శ్రమ, పట్టుదల, కృషి ఉండాలి. అవన్నీ ఉన్నా అదృష్టం కలిసి రాకుంటే. . సూపర్ స్టార్ స్థాయి నుంచి

స్ట్రీట్ లోకి దిగిపోయే స్థితి కూడా వచ్చేస్తుంది. అయితే సుమారు 50 సినిమాల్లో నటించి, పరిశ్రమలో నిలదొక్కుకునే స్థితిలో కరోనా మహమ్మారి ప్రభావానికి జీవనో పాది లేక భాగ్య నగర రోడ్లపై చిన్న వ్యాపారులుగా మారుతున్నా వారెందరో ఉన్నారు. వారిలోనే వారే ఒకరు సునీత. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా. వెండి తెరపై

వెలగాలన్న కలతో పదేళ్ల క్రితం హైదరాబాద్‌ తరలివచ్చారు. చిన్న చిన్న అవకాశాలు పొందారు. ఇప్పటివరకు 50కి పైగా చిత్రాల్లో చిన్న వేషాల్లో నటించారు. 

కరోనా ఆమె కథను మార్చేసింది. కలను చెరిపేసింది. సినిమా చిత్రీకరణలు లేకపోవడంతో అవకాశాలు రావటం లేదు. సొంతూరికి తిరిగి వెళ్లలేక.. పొట్టకూటికి పాట్లు పడుతున్నారు.

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో గురువారం ఇలా ఫుట్‌పాత్‌పై పుచ్చకాయలు విక్రయిస్తూ కనిపించారు. భాగ్యనగరం లో ఇలాగ ఆత్మాభిమానంతో జీవించేవారు ఎందరో ఉన్నారు. 

సినిమా రంగం అనగానే చాలామందికి అడ్డదారుల్లో అక్రమంగా డబ్బులు సంపాదించేవారే కనపడతారు తప్ప ఆత్మాభిమానంతో జీవించేవారు కనపడరు. మీడియా సైతం తప్పుడు

పనులు, కాస్ట్ కౌచింగ్ చేసేవారినే  మీడియా ల్లో చూపిస్తే. . మొత్తం సినిమా రంగం అంటే ఇలాంట తప్పుడు గాళ్ళు మాత్రమే అనే భావనలో సామాన్య ప్రజలు సైతం ఉన్నారు. 

.. కానీ ఇలా ఆత్మాభిమానం తో గౌరవంగా కష్టపడి పనిచేసి బ్రతికే వాళ్ళను పట్టించుకోము... ఇలాంటి వారికి మంచి అవకాశాలు వచ్చి వారు కోరుకున్న రంగంలో వెలుగొందాలని

మనస్పూర్తిగా ఆశిస్తున్నాం. .. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam