DNS Media | Latest News, Breaking News And Update In Telugu

1000 ఆర్డీ ఖాతాలు దాటిన విశాఖ బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ

*లోన్స్ తో పేదలకు అండగా సొసైటీ : మేనేజర్ కామేష్* 

*విశాఖపట్నం, జూన్ 11, 2021 (డిఎన్ఎస్):* బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పడిన బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ,విశాఖ నగర బ్రాంచ్ రుణాలు మంజూరు చేయడంలోనూ, అలాగే రికరింగ్ డిపాజిట్లు సేకరణ లో కూడా ముందంజలో ఉంది. ఈ సందర్భంగా సొసైటీ బ్రాంచ్ మేనేజర్ కామేష్

మీడియాతో మాట్లాడుతూ బ్రాంచ్  వివిధ పథకాలు ద్వారా బ్రాహ్మణులకు చేరువవుతూ అభివృద్ధి పథంలో కొనసాగుతున్నదని వివరించారు. ముఖ్యంగా తమ బ్రాంచి ద్వారా ఇప్పటికే 1000  కు పైగా రికరింగ్ డిపాజిట్ అకౌంట్లు సేకరించామని తెలియజేశారు. ఈ రికరింగ్ అకౌంట్ల ద్వారా 50 లక్షలు రూపాయలు పొదుపు చేయబడ్డాయని పేర్కొన్నారు.  కోవిడ్ సమయంలో

బ్రాహ్మణులకు చేయూత నిచ్చే దిశగా విశాఖ జిల్లా వ్యాప్తంగా మహిళా సాధికారత కు అరుంధతి రుణాలు, పురుషుల స్వయం ఉపాధి కొరకు వశిష్ఠ రుణాలు అందిస్తున్నామన్నారు.అర్చకులకు, పురోహితులకు అతి తక్కువ వడ్డీ పై రుణాలు  ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మేనేజర్ కామేష్ వెల్లడించారు. అంతేకాకుండా కోవిడ్ కారణంగా ఆదాయాన్ని కోల్పోయిన

 బ్రాహ్మణ కుటుంబాలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని  ఇటువంటి కుటుంబాలకు చేయుతనిస్తూ బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ గ్రూపు రుణాలను అందిస్తున్నామని చెప్పారు. రుణం ఎలా పొందాలి అనే విషయాన్ని బ్రాంచ్ మేనేజర్ వివరిస్తూ  ముగ్గురు మహిళలు గాని లేక ముగ్గురు పురుషులు కానీ ఒక గ్రూపుగా ఏర్పడితే అరుంధతి వశిష్ట గ్రూపుల ద్వారా 45వేల

రూపాయలు రుణం ఇస్తామని, అంతే కాకుండా నలుగురు పురోహితలు/అర్చకులు గ్రూపుగా ఏర్పడితే లక్షా 60 వేల రూపాయలు రుణం ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ రుణాలు కేవలం 8.25 శాతం నుండి 10.5 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని బ్రాంచి మేనేజర్ కామేష్  తెలిపారు.అదేవిధంగా నివాస గృహాలపై 25 లక్షల వరకు తనఖా రుణం  10.5 శాతం వడ్డీ పై ఇవ్వడానికి

క్రెడిట్ సొసైటీ సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ సదవకాశం జిల్లాలోని బ్రాహ్మణ కుటుంబాలు వినియోగించుకోవాలని క్రెడిట్ సొసైటీ మేనేజర్ కామేష్ కోరారు. పూర్తి వివరాల కోసం బ్రాంచ్ మేనేజర్ కామేష్ సెల్ నెంబర్ 96037 89252 లేదా ల్యాండ్ లైన్ నెంబర్ 08912561655 లలో గాని, నేరుగా అక్కయ్యపాలెం మెయిన్ రోడ్డులో ఆంధ్ర బాంక్ ఎదురుగా ఉన్న బ్రాంచ్

ఆఫీస్ నందు గాని సంప్రదించాలని కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam