DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొరోనాతో గతించిన వారికి సద్గతులు కలగాలని కోరుతూ వైభవేష్టి

*చిన్న జీయర్ స్వామి సూచన మేరకు శ్వాస్ బృందం నిర్వహణ*

*హైదరాబాద్ శ్రీవైష్ణవ పండితుల ఆధ్వర్యవం లో నిర్వహణ* 

*మీవాళ్ళ వివరాలను వాట్సాప్ లో పంపండి, హోమం చేస్తాం: శ్వాస్*  

*వాట్సాప్ నంబర్స్: +91 95027 77196,  +91 94403 28807, +919885585153*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం / హైదరబాద్ ,

జూన్ 15, 2021 (డిఎన్ఎస్):* ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ఉభయవేదాంత ఆచార్య పీఠాధిపతులు, అపర రామానుజులుగా కొనియాడబడుతున్న త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఆదేశాల మేరకు కొరోనా బారినపడి మరణించిన వారికి సద్గతులు కలగాలని శ్రీవైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి ( శ్వాస్)  పండితులు వైభవేష్టి ని నిర్వహిస్తున్నారు. ఈ నెల

14 నుంచి 18 వరకూ వరుసగా ఐదు రోజుల పాటు ఈ వైభవేష్టి నిర్వహిస్తున్నట్టు  తెలిపారు. జీయర్ స్వామి ఆశ్రమ అనుబంధంగా సంస్థలు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, వికాస తరంగిణి లతో కలిసి శ్వాస్ ఈ అద్భుతమైన వైదిక కార్యక్రమాన్ని పూర్తిగా ఉచితంగానే నిర్వహిస్తోంది. 
ఇటీవల కాలం లో కరోనా బారిన పడి ఎందరో అమాయకులు అకాల మరణాన్ని

పొందారని, వారందరికి సద్గతులు లభించాలనే సంకల్పంతో జీయర్ స్వామి సూచనల మేరకు ఈ వైదిక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 

కరోనా మహమ్మారి వలన చాలా మంది కుటుంబాలలో ఆప్తులను, బంధువులను కోల్పోయి నిరుత్సాహంతో ఇబ్బంది పడుతున్న భక్తులకు ధైర్యాన్ని అందించటానికి, మరణించిన వారికి ఉన్నత లోకాలు ప్రాప్తించి భగవద్

సాన్నిధ్యం పొందే విధంగా శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం వైభవేష్టి హోమం, 11 మంది శ్రీవైష్ణవ స్వాములకు తదీయారాధన సోమవారం నుండి శుక్రవారం వరకు 5 రోజుల పాటు హైదరబాద్ శ్రీ వేంకట నిలయం భవనంలో నిర్వహించబడుతున్నాయి.

అందరూ ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేనందున ఈ కొరోనా బారిన పడి అకాల మరణం పొందిన వారి

పేరు, గోత్రం వివరాలను తమ వాట్స్ అప్ నెంబర్ కు పంపాలని కోరుతున్నారు. ప్రతి రోజు ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా లైవ్ లో ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు. 

*కరోనా కారణంగా మరణించినవారి  గోత్ర నామాలు క్రింది నంబర్స్ కి what's up ద్వారా

తెలియపరిస్తే, అందరి పేర్లతో హోమం జరుపబడుతుంది*
Ph: +91 95027 77196
Ph: +91 94403 28807
Ph: +919885585153
*ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షించవచ్చు*

*సమయం*: *ప్రతీరోజు* 11.00 am to 12. 30  pm (14/06/2021 *సోమవారం* నుండి 18/06/2021 *శుక్రవారం* వరకు)

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam