DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయ, ఆగమ సంప్రదాయ రక్షణ కై శ్రీవైష్ణవ సంఘం అడుగులు

*గ్రామ స్థాయి నుంచే బలోపేతం కోసం సమాజ శ్రేయస్సుకై. .*

*శ్రీవైష్ణవ సంఘానికి మల్లాది శుభాకాంక్షలు. . .*

*విజయవాడలో అఖిల భారత వైష్ణవ సంఘం కార్యాచరణ వెల్లడి*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విజయవాడ / విశాఖపట్నం, జూన్ 18, 2021 (డిఎన్ఎస్):*  ఆలయాలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి

చెందుతుందని, తద్వారా దేశం యావత్తు సుఖ శాంతోషాలతో వర్ధిల్లుతుందని, సమాజ శ్రేయస్సు కోసం లో శ్రీవైష్ణవ సమాజం అన్నీవేల్ల్లా ముందడుగు వేస్తోందని అఖిల భారత వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు కొడవటిగంటి నరసింహాచార్యులు తెలియచేసారు. ఆదివారం విజయవాడ లోని గాంధీనగర్లోని చిట్టూరి స్కూల్లో విజయవాడ సెంట్రల్  నియోజక

వర్గ స్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైందవ సనాతన సంప్రదాయం ప్రకారం ఆలయాలు ఉన్నతంగా ఉండాలి అంటే ఆయా సంబంధిత ఆగమ సంప్రదాయం ప్రకారమే అర్చనాదికాలు జరగాలన్నారు. తద్వారా సంప్రదాయం రక్షించబడి, కొనసాగించ బడుతుందన్నారు.
సమాజ శ్రేయస్సు కోసం ఆలయాలు, ఆగమ, సంప్రదాయ పరిరక్షణ కోసం గ్రామా స్థాయి నుంచే

సంఘాన్ని బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యాచరణలో భాగంగా త్వరలోనే శ్రీవైష్ణవ సంప్రదాయ పరుల పూర్తి వివరాలతో ఒక సమగ్ర సర్వే చేపడుతున్నట్టు తెలిపారు. సంప్రదాయపరుల స్థితిగతులు ఈ విధమైన క్షేత్ర స్థాయి సర్వే తెలుస్తుందన్నారు. సభ్యుల పురోగతికి పూర్తిస్థాయి కర్మాచరణ చేపడతామన్నారు. బ్రాహ్మణ కార్పోరేషన్ ద్వారా

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలను అందేలా ప్రయత్నిస్తానని హామి ఇచ్చారు.

ఈ మహా క్రతువులో అఖిలభారత స్ధాయిలో శ్రీవైష్ణవ కుటుంబాల ఐక్యత, సంక్షేమం మరియు శ్రీవైష్ణవ ఆలయ, ఆగమ, సంప్రదాయ పరిరక్షణ కొరకు కృషి చేస్తున్నామన్నారు. 

కార్యక్రమంలో విశిష్ట అతిధిగా కొంపల్లి వేంకట నరసింహాచార్య స్వామి

(త్రిదండి అహోబిల జీయర్ స్వామి పూర్వాశ్రమ తండ్రి ) విచ్చేసి శ్రీవైష్ణవ ఐక్యతకు కృషిచేస్తున్నందుకు మంగళాశాసనాలు అందించారు. ఇది చాలా అత్యవసరమని, సంఘానికి తన శాయశక్తులా సహాయసహకారాలందిస్తామని తెలియజేసారు. 

త్వరలో కృష్ణజిల్లాస్ధాయి సమావేశం జరపాలని, నియోజకవర్గ స్ధాయి కమీటీల ఏర్పాటు జరగాలని

తీర్మానించారు.

సంఘ లక్ష్యాలు, ఉద్దేశాలని సంఘం సంయుక్త కార్యదర్శి నల్లాన్ చక్రవర్తుల రాఘవాచార్యులు వివరించి అందరి సహకారాన్ని కోరారు. 

అనంతరం కోశాధికారి అకలంకం పార్ధసారధి మాట్లాడుతూ సంఘం పటిష్టం కావాలంటే ప్రతిఒక్కరు తమవంతు బాధ్యతగా కృషిచేయాలని, విమర్శల వల్ల ప్రయోజనాలుండవని, ఎవరికివారే తమ

తమ స్ధాయిలలో సంఘ పటిష్టతకు తద్వార శ్రీవైష్ణవ సంక్షేమానికి సహకరించాలని కోరారు.

నండూరి పవన్ మాట్లాడుతు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పర్యటించి, ప్రతి గ్రామం లోని సంప్రదాయ పరులను ఏకత్రాటిపైకి తీసుకువచ్చేలా కృషి చేస్తానని తెలియజేసారు.

కార్యక్రమంలో  ప్రచార కార్యదర్శి శ్రీమతి ఉత్పల విద్యావతి సంఘం

సభ్యులను గుర్తించే ప్రామాణికతల గురించి వివరించారు. 

ఈ సమావేశ వివరాలను సంఘం ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజీ విడుదల చేసారు. 

శ్రీవైష్ణవ సంఘానికి మల్లాది శుభాకాంక్షలు. . .

సమాజ శ్రేయస్సుకోసం ఆలయ, ఆగమ, సంప్రదాయ రక్షణ భాద్యతలను చేపట్టిన అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ

సంఘానికి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు  ఫోన్ సందేశం ద్వార శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సంఘానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. 

కార్యక్రమం పూర్తిగా కోవిద్ నిబంధనలకు లోబడి కోరుకొండ భట్టర్ శ్రీహరి, గోవర్ధనాచార్యులు, శ్రీనివాసాచార్యులు, కృష్ణ   నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో వివిధ

ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam