DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఢిల్లీ స్పోర్ట్స్ వర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి నియామకం

*తెలుగు క్రీడా తేజానికి జనసేనాని పవన్ అభినందనలు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 23, 2021 (డిఎన్ఎస్):* ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా నియమితులైన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి... తెలుగు తేజం కరణం మల్లీశ్వరి కి  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభినందనలు

తెలిపారు. దేశంలో క్రీడా రంగం అభ్యున్నతికి దోహదపడే విశ్వవిద్యాలయానికి తొలి వీసీగా బాధ్యతలు చేపట్టనున్న మల్లీశ్వరి కి నా తరఫున, జనసేన పార్టీ పక్షాన హృదయపూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నానన్నారు. 
శ్రీకాకుళం జిల్లా నుంచి సిడ్నీ ఒలింపిక్స్ వరకూ మల్లీశ్వరి సాగించిన ప్రస్థానం ఎంతో విలువైనది. సిడ్నీ

ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో పతకం సాధించి ఎందరో యువతులకు స్ఫూర్తిగా నిలిచారని, ఇప్పుడు బృహత్తర బాధ్యతల్లో ఆమె అందరికీ మార్గదర్శకంగా నిలుస్తారనే విశ్వాసం ఉందన్నారు.  మల్లీశ్వరి  నేతృత్వంలో క్రీడా విశ్వవిద్యాలయం ద్వారా దేశం గర్వించదగ్గ ఛాంపియన్లను అందించాలని... ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, వెనకబడిన

ప్రాంతాల్లో ఉన్న ఆణిముత్యాల్లాంటి క్రీడాకారులకు సానపట్టాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam