DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోవుల అక్రమ తరలింపు కు గోరక్ష దళ్ యువత అడ్డుకట్ట

*Hyd Councellor obstructed illegal transporation of 50 cows*

*50 cows saved from illegal transport to slaughter house*      

*గోవుల అక్రమ తరలింపు కు గోరక్ష దళ్ యువత అడ్డుకట్ట* 

*రాజమండ్రి నుంచి హైద్రాబాద్ కబేళాకు 50 ఆవులు . .*

*తుక్కుగూడ కౌన్సిలర్ యాదగిరిరెడ్డి నేతృత్వంలో అడ్డుకట్ట*

*హైద్రాబాద్, జూన్ 23, 2021 (డిఎన్ఎస్):* హిందూ సమాజం అత్యంత

పవిత్రం గా పూజించుకునే గోవులను పాశవికంగా హతమార్చేందుకు కబేళాకు తరలిస్తున్న సమయంలో హైద్రాబాద్ లోని తుక్కుగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ బోధ యాదగిరిరెడ్డి వీటిని అడ్డుకున్నారు. గురువారం ఉదయం వీటిని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరరం నుండి హైదరాబాద్ లోని చాంద్రాయణ గుట్ట లోని కబేళాకు తరలిస్తున్న 50 ఆవులు లేగ దూడల

వ్యాన్ ను గోరక్ష దళ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారి పై ఆపడం జరిగింది. తుక్కుగూడ మున్సిపాలిటీ రావిరాల లో కబేళాకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.  
ఒక్క ట్రక్కులో రెండు ఫ్లోర్ లు వేసి వీటిని క్రూరంగా తరలిస్తున్నారు. వీటిని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ కి పంపి అక్కడి నుండి జియా గూడా కామదేను గోశాలకు తరలించడం జరుగుతుందని

యాదిరెడ్డి తెలిపారు. 

ఇప్పటివరకు కొన్ని వందల వ్యాన్ లు, లారీలను పట్టుకుని, అక్రమంగా కబేళాకు తరలిస్తున్న గోమాతలను రక్షించామన్నారు. ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు  చేసినా   ఎన్ని సార్లు ఇలా పట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. పైగా ఇబ్బందులకు  గురి చేస్తున్నారన్నారు. 

ప్రతి ఒక్కరు

కబేళాలకు తరలిస్తున్న ఇలాంటి ఆవులను, లేగ దూడలను రక్షించి గో రక్షణలో పాలుపంచుకోవాలని మనవి చేస్తున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వం లో గత కొన్నేళ్లుగా గోరక్షణ కోసం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam