DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి సేవలో తర్వాత తరం అర్చక కైంకర్య పరులు వీరే 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*తిరుమల / విశాఖపట్నం, జూన్ 25, 2021 (డిఎన్ఎస్):* అఖిలాండ కోటి బ్రహ్మాండ  నాయకుడు తిరుమల శ్రీనివాసుని ఒక్కసారి దర్శించడమే ఎన్నో జన్మల భాగ్యంగా  భావిస్తుంటారు భక్తులు. అలాంటిది ఆ కోనేటి రాయ స్వామికి నిత్యం స్వయంగా ఆరాధనలు చేసే భాగ్యం కేవలం కొన్ని నాలుగు కుటుంబాలకే లభించింది.

వైఖానస ఆగమ విధానం లో నిర్వహించబడే తిరుమల దేవాలయంలో ప్రస్తుతం స్వామి సేవలో తరిస్తున్న కుటుంబాల లో తర్వాత తరం యువకుల పేర్లను శుక్రవారం ప్రకటించారు. ఒక్కో  కుటుంబం నుంచి ఇద్దరు యువ అర్చకులను నేరుగా శ్రీవేంకటేశ్వరుడే ఎంపిక చేసుకున్నాడు. కారణం ఆ నాలుగు కుటుంబాల వారికే ఆలయంలో అర్చన అవకాశాన్ని కలియుగం ఆరంభంలోనే

అనుగ్రహించారు. శుక్రవారం స్వామివారి కౌంకర్యసేవాభాగ్యం  అదృష్టం పొందిన వాళ్ళల్లో కిట్టూ, కృష్ణ చంద్ర, అభిరామ,శేషు, రాహుల్, తదితరులు ఉన్నారు. వీరందరికి కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలియచేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam