DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ దేవాలయ సందర్శనం ఎన్నో సమస్యలకు పరిష్కారం 

*హిందువుల్లో మతమార్పిళ్ల కు ప్రధాన కారణాలేంటి ?*

*గుళ్ళకు వెళ్ళకపోవడం కూడా మతమార్పిళ్ల కు కారణమా ?* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 28, 2021 (డిఎన్ఎస్):* సనాతన హిందూ సంప్రదాయం లో ఆలయాల  సందర్శనం ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఆధ్యాత్మిక చైతన్యాన్ని కల్గించడంతో పాటు,

మానసిక ఉల్లాసాన్ని కల్గిస్తుంది. ఆలయ ప్రాంగణాలు ఒక శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సైతం లభిస్తుంది. ఆలయ నిర్మాణం లో అమలు చేసిన వాస్తు శాస్త్రం, ఆర్కిటెక్చర్, విభాగాలకు సంబంధించి ఎన్నో అంశాలు తెలుస్తాయి. ఆధ్యాత్మిక అంశాలతో విజ్ఞాన శాస్త్రాన్ని సమ్మిళితం చేసి, సామాన్యులకు సైతం సులభంగా తెలిసే విధంగా ఆలయ నిర్మాణాలను

చేపట్టారు. 
విదేశీయులు సైతం హైందవ సంప్రదాయం పై ఆసక్తి చూపడానికి ఆలయాలు కూడా ఒక కారణం. 

సామాన్యులకు మంచి విషయాలను అందించే పెద్దలు, విజ్ఞానవంతులు ఎందరికో నిలయంగా ఆలయాలు నిలుస్తున్నాయి. వీరి ద్వారా సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ప్రధానంగా యువతి యువకులకు తెలియని విషయాలను తెలియచెప్పే అర్చక

సిబ్బంది అందుబాటులో ఉంటారు. అన్నింటికంటే ప్రధానంగా ఆలయంలో స్వామి దర్శనం తర్వాత గుడిలో కాసేపు కూర్చోవాలి అంటారు. తద్వారా తోటివారితో కలిసి మంచి, చెడు అంశాలను పంచుకుంటూ, సమస్యలకు పరిష్కారం పొందగలిగే అవకాశం ఉంటుంది ఆలయాల్లో. ఇలా అన్ని కుటుంబాల వారినీ ఒకే చోట కలుసుకోగలిగే అవకాశం ఆలయం కల్పిస్తుంది. 

ఇలాంటి

ఎన్నో అంశాలకు సత్వర పరిష్కార మార్గం అందించే ఆలయాన్ని సందర్శించడం ద్వారా మనోభారం తగ్గుతుంది. ఏరోజు విశిష్టత ఏంటో తెలియచేస్తూ, తోటి సహచర కుటుంబాలకు సాయపడే విధంగా వేడుకలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒక కార్యక్రమాన్ని అందరితో ఆకలిసి పాల్గొనడం ద్వారా టీమ్ వర్క్ అలవాటు అవుతుంది. 

ఆలయాల్లో భక్తులు రాకతో

ఎప్పుడైతే కలకలలాడుతుంటాయి. . .మన హైందవ ధర్మం, సంప్రదాయం విలువ, వైభవం అందరికి తెలుస్తాయి. వీటిని ఒకసారి అనుభవించినవాళ్లు ఎన్నటికీ మరిచి పోయి, సనాతన హైందవ ధర్మం వీడి పోరు. 

ఆలయాలు భక్తుల రాకతో కళకళలాడుతుంటే. . అన్యమత ప్రచారకులు ఈ ప్రాంతంలో ప్రవేశించే అవకాశమే ఉండదు. ఒకవేళ ప్రవేశించి మతమార్పిళ్లకు

ప్రయత్నించినా సంఘటితంగా తరిమికొట్టడం జరుగుతుంది. 

ప్రస్తుత కాలం లో హిందువులను బలవంతంగా మతమార్పిళ్ల కు పాల్పడడానికి గల కారణాల్లో హిందువులు క్రమం తప్పకుండా గుళ్ళకు వెళ్ళకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. ఆర్ధిక సమస్యలకు సైతం తగిన పరిష్కారం చూపే శక్తి హైందధర్మంలో ఆలయాలకు ఉంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam