DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవైష్ణవ సంఘానికి రామానుజ కూటమి అప్పగింత

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం / తాడేపల్లిగూడెం, జూన్ 30, 2021 (డిఎన్ఎస్):* ఆగమ, ఆలయ, వైదిక సంప్రదాయాలను పరిరక్షించేందుకై నిరంతరం శ్రమిస్తున్న అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణా సంక్షేమ సంఘం సేవలను గుర్తిస్తూ. . నిరాదరణకు గురైన రామానుజ కూటం ( భవనాలు ) నిర్వహణను అప్పగించడం జరుగుతోందని సంఘం ప్రధాన

కార్యదర్శి,  యతిరాజుల బాలబాలాజీ ప్రకటించారు. బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన వివరాలను వెల్లడించారు. వీటిలో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోనీ తాడేపల్లిగూడెం దగ్గర తాళ్ల ముదునూరు పాడులోని వీరరాఘవ రామానుజకూటాన్ని సంఘ పరిధిలోకి తీసుకోవడం జరిగింది. స్ధానిక ఎం.ఎల్.ఎ  కొట్టు సత్యనారాయణ

సహాకారంతో భవనం తాళాలను ఇ ఒ చంద్రశేఖర్ సంఘ కేంద్ర కార్యవర్గానికి అప్పగించడం జరిగింది. వీటి నిర్వహణను పూర్తిగా వైష్ణవ సంఘం పరిధిలోనే ఉండే విధంగా అనుమతులను తీసుకోవాల్సి ఉంది. దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సంఘ జాతీయాధ్యక్షులు కొడవటిగంటి నరసింహాచార్యులు, ఉపాధ్యక్షులు  చక్రవర్తుల ఎ.పి. శ్రీనివాస

రామానుజాచార్యులు , గౌరవ సలహాదారులు బికెఎస్ఆర్ అయ్యంగార్, పశ్చిమగోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు. ఇఒ చంద్రశేఖర్ ని సత్కరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam