DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాఠ్యంశాల్లో జాతి గర్వించే వాస్తవ చరిత్రలకు మోడీ శ్రీకారం

*విద్యా సిలబస్ లో కుహనా చరిత్రలకు చరమగీతం* 

*కావలసింది అక్బర్, టిప్పులు కాదు ఝాన్సీలక్ష్మి, రుద్రమదేవిలే* 

*హర్షం వ్యక్తం చేస్తున్న మేధావులు, చరిత్ర పరిశోధకులు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 30, 2021 (డిఎన్ఎస్):* గత పాలకులు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మొత్తం

భారతజాతి చరిత్రను వక్రీకరిస్తూ రాసిన చరిత్ర పుస్థకాలలొ మార్పులు చేయడానికి ప్రజల నుండి సలహాలు, సూచనలు కోరుతూ మోది ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అవాస్తవాలను, కల్పిత కథలను భారతీయ పాఠశాల విద్యా పాఠ్యాంశాల నుంచి తొలగించడం జరుగుతుందని ప్రకటించింది.  

రాజ్యసభ సచివాలయం నుంచి విడుదలైన ప్రకటనలో భారత జాతి

శతాబ్దాల నుంచి ఎంతో ఉన్నతంగా జీవనాన్ని సాగించిందని, స్వతంత్ర భారతం కోసం పోరాటం చేసిన వాళ్ళల్లో ఎందరో మహిళలు సైతం కీలక పాత్ర పోషించారని తెలిపింది. వారందరి చరిత్రలను సూచిస్తూ. .వారు చేసిన సేవలను తెలియచేయాల్సి ఉంది.

ప్రస్తుత విద్యా విధానంలో యువతకు వినియోగపడే అంశాలేవీ లేవని, పూర్తిగా అవాస్తవాలను, క్రూరులైన

హింసాత్మక చరిత్ర కల్గిన రాజులను ప్రపంచ హీరోలుగా చిత్రీకరించి, నిజమైన హీరోలను విలన్లు గా మార్చేశారన్నారు. 

ప్రస్తుత యువతకు ఆదర్శంగా నిలిచేవారు ఝాన్సీ లక్ష్మి, రుద్రమదేవి, రాణి చెన్నమ్మ, చాంద్ బిబి, ఝల్కారి బాయ్ లాంటి వాళ్ళు ఎందరో ప్రజా బాహుళ్యంలోకి తెలియని వాళ్ళు ఉన్నారన్నారు.  

ప్రజలు,

విద్యార్థులు, మేధావులు, మీ సలహాలను ఇంగ్లీషు లేదా హిందీ భాషలలొ ఈ మెయిల్ కు పంపించండి rsc_hrd@sansad.nic.in కు పంపవచ్చు. 
   
ఈ విధమైన విద్యావిధానంలో మార్పులను కొన్నేళ్ల నుంచి మేధావులు, విద్యార్థులు కోరుకుంటున్నారు. మన భారత దేశం పైకి ముఘలాయిల దండయాత్ర చెయ్యక ముందు ఈ దేశంలో ఇస్లాం అంటే తెలియదని, మతం మారని లక్షలాది మంది

హిందువులను అత్యంత క్రూరంగా చంపిన అక్బర్, టిప్పు లను గత పాలకులు ప్రపంచంలోనే హీరోలుగా చిత్రీకరించారన్నారు. 

ఈ దేశం కోసం పోరాడిన పృథ్విరాజ్ చౌహన్, రాజా హరిసింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, లాంటి ఎందరో వీర వనితలు చరిత్రకు అందకుండా వారి చరిత్రలను సమాధి చేసిన ఘనత గత పాలకులదేనని మండిపడుతున్నారు. 
ఇస్లాం అంటేనే

తెలియని ఈ దేశంలో కోట్లాది మసీదులు ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. వాటిల్లో 90 శాతం మసీదులను హిందూ దేవాలయాలను కూల్చి, ధ్వంసం చేసి  కట్టినవేనని చరిత్ర ఆధారాలున్నాయన్నారు. 

ప్రస్తుతం ప్రధాని తీసుకున్న నిర్ణయం తో భారతావని అసలు చరిత్ర ప్రపంచానికి తెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  
/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam