DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోర్కెలు తీర్చే దైవం శ్రీరమ్య తిరుమల సన్నిధి శ్రీకాకుళంలోనే

*జులై 10 నుంచి సమాజ శ్రేయస్సుకై రామాయణ పారాయణ* 

*ఈ స్వామి సన్నిధి లో పారాయణలే పరమౌషధం. . *

*ఆలయ అభివృద్ధి, స్వాగత ద్వారానికై విరాళాలకు పిలుపు*
  
*(DNS report : వెంకటాచార్యులు S, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)* 

*శ్రీకాకుళం, జూన్ 30, 2021 (డిఎన్ఎస్):* ఎంతగానో తీరని కోర్కెలు సైతం తీర్చే దైవం శ్రీ రమ్య

తిరుమల స్వామి సన్నిధి శ్రీకాకుళం లోనే ఉంది. శ్రీకాకుళం నుంచి అరసవల్లి వెళ్లే మార్గంలో అత్యంత రద్దీ ప్రాంతమైన మెయిన్ రోడ్డు లోనే నెలకొని ఉంది. శ్రీశ్రీ సంప్రదాయ సాహిత్య రంగం సంస్థ ఆధ్వర్యవంలో నిర్వహించబడుతున్న ఆధ్యాత్మిక కేంద్రం ఇది. ఇక్కడ సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుని సాక్షాత్కారం లభిస్తుంది. తిరుమల తిరుపతి

క్షేత్రం నుంచి వచ్చిన మూలవిరాట్టే ఈయన. గత కొన్నేళ్లుగా భక్తుల కోర్కెలు తీరుస్తూ. .శ్రీమహాలక్ష్మి సమేతంగా కొలువై ఉన్నాడు. 

లోక సంరక్షణార్థం, కొరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని రక్షించమని, ఈ సన్నిధికి ప్రధాన స్వాగత ద్వారా నిర్మాణం కోసం జులై 10, 2021 శనివారం నుంచి (పునర్వసు నక్షత్రం ) నుంచి ఆగస్టు 5 వ తేదీ గురువారం 27

రోజుల పాటు శ్రీమద్రామాయణ పునర్వసు  పారాయణ నిర్వహిస్తున్నట్టు ప్రధాన అర్చకులు కరి రంగనాధ మాధవాచార్యులు తెలియచేస్తున్నారు. 

భక్తుల కోర్కెలు సిద్ది కోసం, శ్రీ రమ్య తిరుమల ఆలయ అభివృద్ధి కొరకు జరుగుతున్నఈ పునర్వసు పారాయణం లో పాల్గొనదలచిన భక్తులు పూర్తి వివరాలకు అర్చకులు (ఫో.: 9440061940 )

సంప్రదించవచ్చన్నారు. 

ఆలయ ప్రాంగణం లో నిత్యం శ్రీరామాయణ, సుందరకాండ, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు జరుగుతూనే ఉంటాయి. వివిధ సమస్యల పరిష్కారానికై సన్నిధి కి వచ్చే భక్తులకు ఈ పారాయణాలు ద్వారా మంచి ఫలితాలను అందిస్తున్నాడు తిరుమల నాధుడు.  

త్వరలోనే ముఖ ద్వారా మండపం. .

ప్రస్తుతం

ఆలయం మాత్రమే ఉండడంతో స్వాగత ద్వారం ఏర్పాటుకై ఆలయ అర్చక ట్రస్టీ రంగనాధ్ మాధవాచార్యులు శ్రీరామాయణ పారాయణ నిర్వహిస్తున్నారు. ఈ మహోన్నత కార్యక్రమం లో భక్తులు సైతం పాల్గొని, శ్రీనివాసుని ముఖ ద్వారా మండపంలో తాము సైతం పాలుపంచుకునే అవకాశాన్ని అందిస్తున్నారు. జులై 10 నుంచి జరుగనున్న శ్రీరామాయణ పారాయణ ప్రధాన అంశం కొరోనా

మహమ్మారి నుంచి సమాజానికి శాశ్వత విముక్తి, ఆలయ ముఖమండపం,  భక్తుల చింతనలు పరిష్కారం. ప్రతి రోజు ఉదయం నుంచి 27 రోజుల పాటు ఈ పారాయణ యజ్ఞం జరుగనుంది. 

మూలవిరాట్ కేవలం 2 అడుగులు మాత్రమే ఉన్నప్పడికే భక్తులకు పదింతల ఫలితాన్ని ఇసున్నాడు. ఈ సన్నిధిలో గత దశాబ్దన్నర కాలంగా నిత్య సుందరకాండ పారాయణ, చేస్తుండడంతో

ప్రాంగణమంతా వైభవంగా వెలుగొందుతోంది. 

శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డు లో ఉన్న ఈ ఆలయం అరసవల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో భక్తులందరికీ స్వాగతం పలుకుతోంది. 

స్వామి కి ఆదేశం మేరకు ఈ సన్నిధిని ప్రస్తుత ట్రస్టీ రంగనాధ్ తండ్రి కరి వెంకటాచార్యులు నిర్మించడం జరిగింది. దీన్ని ఒక ప్రార్ధన సమావేశ

మందిరంగా నిర్మించినప్పడికీ, స్వామి అనుగ్రహం ఫలితంగా పూర్తి స్థాయి దేవాలయంగా మార్చడం జరిగింది. నాటికి ప్రస్తుత ట్రస్టీ రంగనాధ్ సాధారణ ఉద్యోగం లో ఉండడంతో ఆలయ భాద్యతలను వ్యవస్థాపకులు చూసేవారు. తర్వాత కాలంలో శ్రీనివాసుని ఆదేశం మేరకు రంగనాధ్ ఉద్యోగాన్ని వీడి, స్వామి సన్నిధిలో అర్చకత్వ సేవ చేసేందుకు సిద్ధపడ్డారు.

నాటి నుంచి ఆలయాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. 

మొదట్లో కొన్నేళ్లు కేవలం శ్రీనివాసుడే  ఆరాధనలు అందుకునేవాడు. తదుపరి కాలంలో మహాలక్ష్మి అమ్మవారు దర్శనమిచ్చి, తనకు విగ్రహ ప్రతిష్ట కావించమని సూచించడంతో ప్రముఖ వైదిక ఆగమ పండితులు చామర్తి జగ్గ అప్పలాచార్యుల సారధ్యంలో, సింహాచల క్షేత్ర అర్చక పండితుల

నేతృత్వంలో ఇదే ప్రాంగణంలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కావించారు. 

ఆధ్యాత్మిక పరమైన సమావేశాలు, కార్యక్రమాల నిర్వహణకు ఈ సన్నిధి వేదికగా మారింది. ఎందరో ప్రముఖులు సైతం ఈ సన్నిధిని దర్శించి, స్వామికి మంగళాశాసనం చేశారు. 

ప్రస్తుతం నిత్య అన్న ప్రసాద ( తదీయారాధన) జరుగుతున్నప్పటికీ పూర్తి

స్థాయిలో అమలు చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. భక్తులు సమర్పించే విరాళాలను బ్యాంకు ఖాతాలో వేసి, మూల నిధి పై వచ్చే వడ్డీ తో తదీయారాధన, ప్రసాద వితరణ చేపడుతున్నారు. 

ఈ ఆలయాన్ని మరింత విస్తరింప చేసి, త్వరలోనే ధ్వజ స్థంభం, ప్రధాన స్వాగత ద్వారం, తదితర కార్యక్రమాలను వైభవోపేతం గా నిర్వహించేందుకు సంకల్పం

చేసారు. అయితే ప్రస్తుతం కొరోనా ప్రభావం కారణంగా పూర్తిగా నిబంధనలను అమలు చేస్తున్నారు. 

ఆలయ అభివృద్ధి, సేవ కార్యక్రమాల్లో పాల్గొనదలచిన భక్తులు అర్చక ట్రస్టీ కరి రంగనాధ్ మాధవాచార్యులు ను ఫో: 9440061940 నెంబర్ లో సంప్రదించవచ్చు.  
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam