DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దైవదూషకుడికి దండిగా 17 లక్షల దుడ్డులు సమర్పణ 

*ఏపీ ప్రభుత్వం పై మండిపడుతున్న హిందూ సమాజం* 

*ఈ ఘటన లో సమాధానం దొరకని ప్రశ్నలు ఇవే. . .*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 02, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధం లేని హిందూ దేవీదేవతా దూషకుడికి కార్పొరేట్ ఆసుపత్రి లో చికిత్స కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ

ఖజానా నుంచి రూ. 17 లక్షల రూపాయలు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా హిందూ ధార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ఇదే అంశంపై సోషల్ మీడియా లో విస్తృతంగా విమర్శలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సోషల్ మీడియా లో ప్రజలు ప్రశ్నలు సంధించే వారిలో జనసేన అధికార ప్రతినిధి పి

వివేక్ బాబు, మేడా శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ, భారతీయ జనతా యువ మోర్చా నేత విజయ్ శంకర్ ఫణి, ముడుంబై విజయ్, శ్రీనివాస్ వజ్జల, తదితరులు ఉన్నారు. 

*1. అతను ఆంధ్ర ప్రదేశ్ పౌరుడు వాడు కాదు, ఇక్కడ నివాసి కాదు. ఇతనికి AP తో సంబంధం ఏంటి?*  ఆటను హైద్రాబాద్ ( తెలంగాణ) లో

నివాసం ఉంటున్నాడు. 

*2. ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం పొందాలన్నా వాళ్ళు ఈ రాష్ట్రంలో నివాసం ఉండాలి, ఇక్కడ ఆధార్ కార్డు ఉండాలి, ఇక్కడ చిరునామా ఉండాలి. 

*3. ఇతనికి ఆధార్ కార్డు AP లో లేదు. ఇక్కడ చిరునామా లేదు. అలాంటప్పుడు ఇతనికి ఏ ప్రాతిపదికన రూ. 17 లక్షలు నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల

చేసారు.* 

*4. ఆర్ధికంగా పేద వాళ్ళకి (AP లో తెల్ల కార్డు ఉండాలి) మాత్రమే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం ఇస్తారు. ఇతనికి ఏపీ లో తెల్ల కార్డు ఉందా? లేక తక్కువ ఆదాయం చూపించాడా?*

*5. ఆంధ్ర లో కారు ఉన్నవాళ్ళకి తెల్లకార్డు ఇవ్వరు. పైగా వాళ్లకి ప్రభుత్వ పధకాలు రావు. ఇతను రూ. 30 లక్షలు విలువ చేసే ఇన్నోవా కారులో

తిరుగుతాడు. మరి ఇతను పేదవాడు ఎలా అయ్యాడు.?*

*6 . కారు లో డ్రైవింగ్ చేసేవాళ్ళు కచ్చితంగా సీటు బెల్టు పెట్టుకోవాలి. లేకుంటే కేసు నమోదు చేస్తారు.  ఇతను సొంతంగానే కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. పైగా సీటు బెల్టు పెట్టుకోలేదని తెలుస్తోంది. మరి ఇతని మీద కేసు పెట్టారా?*

*7. ఆపై ఆక్సిడెంట్ చేసాడు. దానికి కేసు

నమోదు చేశారా?*

*8 . ఎలా చూసుకున్నా సీటు బెల్టు లేదు, ఆక్సిడెంట్ చేసాడు. కచ్చితంగా కేసు నమోదు చేసి జైలు కి పంపాలి. మరి అలాంటి వాడికి లక్షలు డబ్బులు ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించి ఆసుపత్రి బిల్లు కట్టి ఇంటికే ఎలా పంపుతున్నారు?*

*9. అన్నింటి కంటే. .ముఖ్యమైనది. . ఆర్థికంగా పేదవాడు, డబ్బులు లేనివాడు

ఆక్సిడెంట్ లో దెబ్బలు తిన్నవాడు లక్షలు ఖర్చు అయ్యే కార్పొరేట్ ఆసుపత్రిలో చేరడు. ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరతాడు.*

*వీటికి సమాధానం లభించే అవకాశం ఉందా?*

పైగా సీటు బెల్ట్. పెట్టుకోలేదు ట. సీటు బెల్ట్ పెట్టుకోకుండా.. కారు నడపడ మే పెద్ద కేసు.. ఆపై. ఆక్సిడెంట్ చేశాడు. అదొక కేసు.. ఇన్ని తప్పులు చేసిన వాణ్ణి

కేసులు పెట్టి లోపలకి పంపాలి గానీ,. ఆసుపత్రి బిల్లు కట్టి ఇంటికి పంపడం ఏంటి?

రాష్ట్ర ఖజానా అప్పుల్లో ఉందని, ఈ రాష్ట్రంలో ఆస్తిపన్నులు భారీగా పెంచిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఖాళీగా ఉన్న ఖజానా నుంచి ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తికీ అప్పనంగా రూ. 17 లక్షల రూపాయలు ఎలా ఇచ్చింది అని

ప్రశ్నిస్తున్నారు.?

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam