DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జులై 8 నుంచి కళాభారతి ఆడిటోరియం పున: ప్రారంభం 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 06, 2021 (డిఎన్ఎస్):* కొరోనా మహమ్మారి విస్తృతంగా ఉండడంతో మార్చి 18 నుంచి మూసివేసిన విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియం ప్రాంగణం ఈనెల 8 నుంచి పున: ప్రారంభమవుతున్నట్టు సంస్థ కార్యదర్శి జీఆర్ కె ప్రసాద్ (రాంబాబు) ఓ ప్రకటనలో తెలియచేసారు. వివిధ కళలకు నిలయమైన కళాభారతి

ప్రాంగణం లో ఎన్నో సంగీత, సాంస్కృతిక, నాటక, నృత్య రంగాల్లో అద్భుతమైన ప్రదర్శనలు జరుగుతున్నాయి.  ప్రభుత్వం సూచనలు మేరకు జూలై 8 వ తారీకు నుంచి సినిమా హాలు, ఫంక్షన్ హాల్స్, ఆడిటోరియంలు తెరిచేందుకు వెసులుబాటు ఇచ్చినందున కళాభారతి ఆడిటోరియం కూడా ప్రారంభం కానుందన్నారు. పూర్తిగా కోవిడ్ నిబంధనలకు లోబడి, కార్యక్రమాలు

యధావిధిగా జరుగుతాయని తెలియజేశారు. గత ఏడాది సైతం పూర్తి నిబంధనలకు లోబడి సంస్థను కొన్ని వారాల పాటు (దాదాపుగా నెలల కాలమే) మూసివేయడం జరిగిందన్నారు. 

50 శాతం ఆక్యుపెన్సీ తో అంటే సీటు విడిచి సీటు మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరూ కఛ్ఛితంగా మాస్కు వేసుకోవాలని సామాజిక దూరం పాటించాలని చేతులు శానిటైజర్

చేసుకోవాలని అన్నారు. 

కార్యక్రమాలు నిర్వహించుకునే సంఘాలు పై నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు. ఏ కార్యక్రమమైనా రాత్రి 9 గంటలకి పూర్తిచేయాలని 9:15 హాలు మూసివేస్తామని  చెప్పారు. 
నగరం లోని సాంస్కృతిక, సంగీత, ఆధ్యాత్మిక సంస్థలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam