DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆచార వ్యవహారాలకు ఆలవాలం ఆషాఢమాసం.. .

*చాతుర్మాస్యం, దక్షిణాయణం ఆరంభమయ్యేది ఈనెల్లోనే* 

*(DNS report : వెంకటాచార్యులు S, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)* 

*శ్రీకాకుళం, జులై 09, 2021 (డిఎన్ఎస్):* హిందూ సంప్రదాయం లో ఒక్కో నెలకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ / పూర్వాషాఢ నక్షత్రాల

సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది.  ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న ఆషాఢమాసం ప్రాశస్త్యం ఇదే. 
ఈనెల సనాతన హైందవ సంప్రదాయంలో అనేక ఆచార వ్యవహారాలకు ఆలవాలంగా నిలుస్తోంది. జీయర్ స్వాములు,

యతీశ్వర్లు, సన్యాసులు, అత్యంత శ్రద్దగా ఆచరించే చాతుర్మాస్య దీక్ష ఈనెలలోనే చేపడతారు.  

ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును

వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.

ఈ నెలలో విదియ అంటే రెండవ రోజున ప్రపంచ వ్యాప్తంగా జగన్నాధ ఆలయాల్లో స్వామికి వైభవంగా రథయాత్ర చేపడతారు. 

ఈ నెలలో వచ్చే శుద్ధ ఏకాదశినే మహా ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే ప్రథమైకాదశి అని కూడా అంటుంటారు.

తెలుగునాట ఇది తొలి ఏకాదశి. 

చాతుర్మాస్యం దీక్ష ఆరంభం:

వచ్చేది వర్షాకాలం కావడంతో నాలుగు నెలల కాలం పాటు ఒకే ప్రాంతంలో నివాసం ఉండి, నూతన గ్రంధాలను, ప్రబంధాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. నాలుగు నెలల దీక్ష లో మొదటి మాసం ఆషాఢం. ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ

సన్యాశ్రమ దీక్షను ఆచరిస్తుంటారు. 

ఆషాఢ శుద్ధ విదియ    : పూరీ జగన్నాధ రధయాత్ర
ఆషాఢ శుద్ధ ఏకాదశి    : తొలిఏకాదశి
ఆషాఢ శుద్ధ చతుర్దశి : గోదాదేవి జన్మించింది.
ఆషాఢ శుద్ధ పూర్ణిమ     : వ్యాస పౌర్ణమి

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam