DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి తరానికి మనో వికాస విజ్ఞాన వ్యక్తిత్వ దిగ్దర్శనమే తవాస్మి

వాల్మీకి రామాయణానికి మానవ సంబంధ సాక్షాత్కారం తవాస్మి*

*శ్రీరామ చక్రధర్ ఏడేళ్ల తపోదీక్షకు సాకార రూపమే తవాస్మి* 

*రామాయణాన్ని సినిమాలు వక్రీకరించాయి: శ్రీరామ చక్రధర్* 

*ఆ అయిదు నిమిషాలే . . చక్రధర్ జీవితాన్ని మార్చాయి.* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం,

జులై 08, 2021 (డిఎన్ఎస్):* శ్రీ రామాయణం తెలియని వారు ఈ సమాజము లోనే ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఈ సమాజాన్ని ఉద్ధరించేందుకు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఈ భూమిపై మానవ రూపంలో అవతరించి, సంచరించిన నేల ఇది. ఆయన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, సంపూర్ణంగా తెలియచేసేందుకు ఆదికవి వాల్మీకి అందించిన మహా ప్రబంధమే శ్రీ రామాయణం. అయితే

రామాయణాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్లకి అర్ధమైన రీతిలో ఎవరికి  తోచినట్టుగా వాళ్ళు విశ్లేషణలు, విపరీత భాష్యాలూ కూడా వివరిస్తూ. . మూల గ్రంధానికే అపఖ్యాతి తీసుకు వచ్చే విధంగా చేస్తున్నారు. వీటిలో వెండితెర పాత్ర కీలకం.  పైగా సమాజాన్నితప్పుదారి పట్టించే విధంగా, ఎన్నో సందేహాలు కలిగే విధంగా చేయడం లో ఈ సినిమాలు

అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. నేటికీ తప్పుడు తడకలుగా తమకు తోచిన విధంగా సినిమాలను చిత్రీకరించేందుకు రామాయణ కథాంశాన్నే దర్శకులు ఎంచుకోవడం కడు శోచనీయం. 

అయితే వాల్మీకి విరచిత శ్రీరామాయణాన్ని యధాతధంగా, అక్షరం పొల్లుపోకుండా, అందు తెలియచేయబడిన ప్రతి పాత్ర లోని గుణగణాలు నేటి సమాజంలో నేటికీ కళ్ళ ముందు

కదులాడుతున్నాయనే సత్యాన్ని అక్షరం రూపంలో అందించినది తవాస్మి.   

రామాయణంలోని ప్రతి అంశం లోనూ, కధనం లోనూ ఉన్న మనో వికాస విజ్ఞాన వ్యక్తిత్వ సర్వస్వం ద్వారా బాలలకు, యువతకు మార్గదర్శకం చేయాలనే సంకల్పం కల్గిన ఒక యువకుడి ఏడేళ్ల తపోదీక్ష కు శ్రీరాముడు అందించిన వరమే. . .తవాస్మి సారాంశం. . 

ఇంతవరకూ

రామాయణ ప్రవచనం వినివుంటారు, తాత్పర్యాలు చదివి ఉంటారు, పద్యాలకు అర్ధం చదివి ఉంటారు. అయితే. . .ఒక్కో పాత్ర లోని వ్యక్తిత్వ వైభవం, విలువలను అణువణువునా తెలుసుకునే అవకాశం తక్కువగా ఉంటుంది.  

శ్రీరామాయణం లోని ప్రతి పాత్ర ద్వారా,  నేటి తరానికి మనో వికాస విజ్ఞాన వ్యక్తిత్వ దిగ్దర్శనం చేయించాలనే ఏకైక సంకల్పంతో

ఒక విద్యాధికుడైన యువకుడు ఏడు సంవత్సరాల పాటు చేసిన తపోదీక్షకు ఫలితమే ఈ తవాస్మి పుస్తకం. 

వాల్మీకి రామాయణ సంస్కృత మూల గ్రంధాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు సంస్కృత భాషను నేర్చుకుని, కొన్ని వందల సార్లు అక్షరం అక్షరం పరిశీలించి వాటి లోని ప్రతి పాత్ర ను నేటి సమాజం లోని ఏవిధంగా పోలికగా ఉన్నాయో

తెలియచేసారు. 

వివరాల్లోకి వెళితే. ..

బెంగుళూరు నివాసి అయిన రాళ్లబండి శ్రీరామ చక్రధర్ . ..  బిట్స్ పిలానీ ( గోవా క్యాంపస్) లో ఇంజనీరింగ్ పూర్తిచేసి, ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. అయితే సమాజానికి ముఖ్యంగా యువతకు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చెయ్యాలనే సంకల్పంతో ఎందరినో పెద్దలను కలిసి సంప్రదింపులు

జరిపారు. 

ఆ అయిదు నిమిషాలే చక్రధర్ జీవితాన్ని మార్చాయి. 

అయినా తన ఆలోచనలకూ తగిన పరిష్కారం లభించక పోవడంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చిన్న జీయర్ స్వామిని సీతానగరం ఆశ్రమం లో కలిసి, ఒక ఐదు నిముషాలు సమయం కేటాయించవలసిందిగా కోరారు. 
తన సమస్యను స్వామికి వివరించి, ఏదైనా సూచన చేయాల్సిందిగా

కోరడం జరిగింది. చిన్నారుల కోసం ఏదైనా కార్యక్రమం చేపట్టి, వారి ఆలోచనలను మంచి ఉన్నతంగా తీర్చిదిద్దాలని స్వామి సూచించారు. పిల్లలు తెల్ల కాగితం వంటివారని, వారికి ఏ విధమైన విజ్ఞానం అందిస్తే. . వారు ఆ రంగంలోనే వృద్ధి చెందుతారు అంటూ జీయర్ స్వామి చేసిన ఉద్బోధ చక్రధర్ కు మనోఫలకం పై ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోడానికి శ్రీకారం

చుట్టింది. 

దాని ప్రభావమే  వాల్మీకి విరచిత రామాయణ ప్రబంధం ఆధారంగా ప్రతి పాత్ర లోని వైశిష్ట్యాన్ని వివరించే గ్రంధం తవాస్మిగా వెలువడడం. 

ఒక తండ్రి - కుమార్తె ల మధ్య జరిగిన సంభాషణల్లో శ్రీరామాయణ వైభవం, పాత్రల ఔన్నత్యం, ఎన్నో సందేహాలు, వాగ్వాదాలు, ఇలా పూర్తిగా ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో నాటి

ఆధ్యాత్మిక వైభవాన్ని నేటి తరానికి అందించడంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 

పిల్లలకు మరింత విజ్ఞానం కల్గించేందుకు చక్రధర్ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పాఠశాలల్లో విద్యార్థులకు మనో విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం కల్గించేలా, రామాయణ పాత్రలను సూచిస్తూ. .రూపొందించిన తవాస్మి

గ్రంధాన్ని వారిచే చదిస్తున్నారు. తదుపరి, ప్రతి అంశంలో పాత్రల్లో గల గుణాలు తమలో ఏవి ఉన్నాయో తెలుసుకునే విధంగా ప్రశ్నలు, ఆత్మ పరిశీలన దర్పణాలు, ఇలా చిన్నారుల్లో ఆసక్తి కల్గించే విధంగా శిక్షణ , అవగాహనా శిబిరాలు నిర్వహిస్తున్నారు. 

ఈ యువకునికి సహాయకారిగా సహ రచయిత శారదా దీప్తి, ఎందరో యువతి యువకులు, కుటుంబ

సభ్యులు, సీనియర్ విశ్రాంత అధికారి కె వి చౌదరి, ఇలా ఎందరో ఏడేళ్ల కాలం పాటు అండగా నిలబడడం వల్లనే ఈ అద్భుతం బాహ్య ప్రపంచంలో వెలుగు చూసింది అని ప్రకటించడం చక్రధర్ వ్యక్తిత్వం. పైగా ఈ యజ్ఞం లో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సహకరించిన ప్రతి మహిళను మాతృ స్వరూపంలో చూడడం ఈయన సంప్రదాయ గుణాన్ని

ప్రస్ఫుటింపచేస్తోంది. 

మొత్తం నాలుగు భాగాలుగా  ప్రచురించిన ఈ తవాస్మి గ్రంధాన్ని నవంబర్ 6, 2020 న భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆన్ లైన్ ద్వారా విడుదల చేయడం గమనార్హం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam