DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వారిజ లో చిన్న జీయర్ ని దర్శించిన సింహాచలం ఈఓ సూర్యకళ

*వారిజ ఆశ్రమంలో స్వామి ఆశీస్సులు తీసుకున్న ప్రముఖులు.*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 12, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం సింహాచలం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎంవి సూర్యకళ విశాఖ విచ్చేసిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, చిన్న

జీయర్ స్వామి ని దర్శించి, ఆశీస్సులు పొందారు. 
మూడు రోజుల పాటు విశాఖ బీచ్ రోడ్ లోని వారిజ ఆశ్రమం లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన చిన్న జీయర్ స్వామి ని సోమవారం ఈఓ తదితరులు దర్శించి, ఆలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యాచరణను వివరించారు. ఆలయానికి మహిళా అధికారి నియామకం పట్ల అభినందనలు తెలిపి,

ఆశీస్సులు అందించారు.  ఆమె వెంట ఆలయ ఉప ప్రధాన అర్చకులు, అలంకారి భండారి కరి సీతారామాచార్యులు, స్థానాచార్యులు ఎస్ టి పి రాజగోపాల్, ఇతర అధికారులు ఉన్నారు. 

వారిజ ఆశ్రమం లో మూడు రోజుల పాటు బస చేసిన చిన్న జీయర్ స్వామి ని  జనసేన నేత సురక్ష ఆసుపత్రి అధిపతి డాక్టర్. బొడ్డిపల్లి రఘు తదితరులు దర్శించి, ఆశీస్సులు

అందుకున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam