DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర బీజేపీ జాతీయ స్థాయికి ఎదగలేదా, ఎక్కడా పదవే లేదు?

*మంత్రి పదవి లేదు, జాతీయ కమిటీల్లోనూ స్థానం లేదు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 15, 2021 (డిఎన్ఎస్):* భారతీయ జనతా పార్టీ అధిష్టానం అంచనాలకు తగినట్టుగా ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ శాఖా ఎదగలేదా అంటే అవుననే తెలుస్తోంది.  జాతీయ స్థాయి కమిటీల్లో ఎక్కడా ఆంధ్ర ప్రదేశ్ పేరు వినపడక పోవడం ఇదే

సమాధానం ఇస్తోంది. 

ఇటీవల ప్రకటించిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆంధ్ర ప్రదేశ్ కు తప్ప మిగిలిన అన్ని దక్షిణాది రాష్ట్రాలకూ స్థానం లభించింది. యువత అభ్యున్నతి పై దృష్టి పెట్టిన ప్రధాన మంత్రి, బీజేపీ అధ్యక్షుడు నడ్డా లు దేశవ్యాప్తంగా యువతను ప్రోత్సహించే కార్యాచరణను చెప్పట్టారు. ఈ నేపథ్యంలో భారతీయ యువజన

మోర్చా జాతీయ కమిటీ అధ్యక్షునిగా బెంగళూరు కు చెందిన యువ ఎంపీ తేజస్వి సూర్య ను నియమించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ తేజస్వి ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అడుగుపెట్టకపోవడం చూస్తే. . బీజేపీ అధిష్టానం నుంచి నిర్దుష్ట సందేశాలు ఉన్నాయనే తెలుస్తోంది. దీనికి నిదర్శనమే బుధవారం తేజస్వి ప్రకటించిన బీజేవైఎం జాతీయ

కమిటీ లో సైతం ఆంధ్ర కు ప్రాతినిధ్యం లేకపోవడమే. 
ఈ జాబితా లో తెలంగాణ కు చెందిన సయ్యద్ షాజాది కి జాతీయ కార్యదర్శి హోదా కల్పించారు. 
ఉపాధ్యక్షులుగా : అనూప్ కుమార్ సహా ( పశ్చిమ బెంగాల్)( 
మధుకేశ్వర్ దేశాయ్ (మహారాష్ట్ర )
మనీష్ సింగ్ (బీహార్)
అర్పితా అపరాజిత బడజేన (ఒడిశా)
రామ్ సత్పుటే ( ఎమ్మెల్యే -

మహారాష్ట్ర)
డా. అభినవ్ ప్రకాష్ ( ఉత్తర్ ప్రదేశ్ )
నేహా జోష్ ( ఉత్తరాఖండ్)

జాతీయ ప్రధాన కార్యదర్శులుగా: 
రాజు బిస్తా - ఎంపీ ( పశ్చిమ బెంగాల్) 
రోహిత్ చాహల్ ( ఢీల్లి)
వైభవ్ సింగ్ ( ఉత్తర ప్రదేశ్) 

జాతీయ కార్యదర్శులు గా :
 శ్యామ్ రాజ్ ( కేరళ )
షా జాది సయ్యద్ ( తెలంగాణ )
రవి భగత్ ( ఛత్తీస్

ఘర్)
తేజేందర్ పాల సింగ్ బగ్గ ( ఢీల్లి)
గౌరవ్ గౌతమ్ ( హర్యానా)
అరుణ్ జ్యోతి హజారికా (అస్సాం)
నింగ్ థౌజం మోంగ్ పొంగానంబ  (మణిపూర్)

కోశాధికారి గా: సాయి ప్రసాద్ ( తెలంగాణ )
కార్యాలయ ఇంచార్జి గా: వినీత్ త్యాగి ( ఢిల్లీ )
మీడియా ఇంచార్జి గా: అమన్దీప్ సింగ్ ( చండీఘర్ )
సోషల్ మీడియా ఇంచార్జి గా: కపిల్

పర్మార్ ( హిమాచల్ ప్రదేశ్)
పాలసీ, రీసెర్చ్ ఇంచార్జి గా:వరుణ్ ఝవేరి (గుజరాత్)

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam