DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు భాషను భూస్థాపితం చెయ్యడానికే కంకణం కట్టారు 

*లక్ష్మి పార్వతి పదవి వ్యామోహం లో విజ్ఞానం వదిలేశారు.*

*తెలుగు దండు అద్యక్షులు పరవస్తు సూరి మండిపాటు*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జులై  18, 2021, 2020 (డిఎన్ఎస్):* ఎంతో ప్రాచీనమైన తెలుగు భాష వైభవాన్ని భూ స్థాపితం చెయ్యడానికే ప్రభుత్వాలు కంకణం

కట్టుకున్నాయని తెలుగు దండు వ్యవస్థాపక అద్యక్షులు పరవస్తు ఫణిశయన సూరి మండిపడ్డారు. భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని, అలాంటిది  మాతృ భాషను చిన్నాభిన్నం చేసి, సర్వనాశనం చేసేందుకు గత పాలకులు, నేటి పాలకులు శాయశక్తులా కృషి చేస్తున్నారన్నారు. కేంద్ర పరిధిలో నడుస్తున్న సంస్కృత

విభాగాన్ని, అకాడమిని తెలుగు భాష అకాడమీలో కలిపేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో లు విడుదల చేయడాన్ని తప్పుపట్టారు. సంస్కృత భాష అభివృద్ధి కోసం రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ ( తిరుపతి) లో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పింది, దానికి నిధులు, నిర్వహణ అంతా  కేంద్రానిదేనన్నారు. కేంద్రం పరిధిలో నడుస్తున్న అలాంటి సంస్థను

తెలుగు అకాడమీ లో కలిపేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఎలా ప్రకటిస్తుందన్నారు. పైగా దీనికి అధికార భాష సంఘం అధ్యక్షులు, అకాడమీ చైర్మన్ లు వత్తాసు పలకడం దౌర్భాగ్యం అన్నారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారడం వీళ్లకు తగదన్నారు.
తెలుగు భాషను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేకంగా ఒక అకాడమిని నెలకొల్పిన ఘనత అపరచాణుక్యుడు, పూర్వ

ప్రధానమంత్రి పివి నర్శింహారావు దేనన్నారు. అయన రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉండగా, అకాడమిని ఏర్పాటు చేసి, ఆయనే దానికి చైర్మన్ గా  కూడా కొనసాగారన్నారు. తర్వాత కాలంలో ఎన్టీ రామారావు పాలనలో కొంతవరకూ నెట్టుకొచ్చిందన్నారు. తదుపరి చంద్రబాబు హయాంలో భూస్థాపితం చెయ్యడానికి శంకుస్థాపన జరిగితే ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్

రెడ్డి పాలనలో పూర్తిగా భూస్థాపన చేసే కార్యక్రమం జరుగుతోందన్నారు. 

లక్ష్మి పార్వతి పదవి వ్యామోహం లో విజ్ఞానం వదిలేశారు. 

తెలుగు అకాడమీ చైర్మన్ గా ఉన్న లక్ష్మి పార్వతి విలేకరుల సాక్షిగా తెలుగు , సంస్కృత భాషలను పేకాట ముక్కలతో పోల్చడాన్ని తప్పు పట్టారు. తెలుగు భాషలో పరిశోధన ( పీహెచ్ డి ) చేసిన ఆమె

పదవి వ్యామోహంలో తనకు ఉన్న విజ్ఞానాన్ని, విచక్షణను కోల్పోయి, మాటలు తడబడి, పేకాట ముక్కలతో భాషలను పోల్చడం పూర్తిగా దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam