DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అద్వైత వేదాంతమే శ్రీ విశాఖ శారదాపీఠం ఆస్థి 

*గురుపూర్ణిమ వేడుకలో స్వరూపానంద స్వామి ప్రకటన* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 24, 2021 (డిఎన్ఎస్):* అద్వైత వేదాంతమే  శ్రీ విశాఖ శారదాపీఠం ఆస్తి అని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ప్రకటించారు. శనివారం ఉత్తరాఖండ్ లోని రుషికేశ్ ఆశ్రమం లో జరుగుతున్న వ్యాసపౌర్ణమి

వేడుకల్లో భాగంగా భక్తులనుద్దేశించి ఆశీర్వచన సందేశం అందించారు. పీఠాధిపతులు,  ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఇరువురు చాతుర్మాస్య దీక్షను అక్కడే ప్రారంభించడం జరిగింది. కొరోనా ప్రభావం మనవాళిపై తగ్గి సాధారణ స్థితి కి చేరుకోవాలనే సంకల్పంతో ప్రత్యేక ఆరాధనలు చేస్తున్నారు. చాతుర్మాస్య దీక్ష లో

భాగంగా సర్వమానవాళి క్షేమంగా ఉండాలని రాజశ్యామల మాత అనుగ్రహం అందరికి లభించాలని సంకల్పంతో నిరంతర దీక్ష సాగిస్తున్నట్టు తెలియచేసారు. అనుగ్రహ భాషణం ద్వారా ఆధ్యాత్మిక వైభవాన్ని భక్తులకు అందించారు. 

అద్వైత వేదాంతమే ఆస్తి మనం ఎలా పొంది ఆనందమందుతాం?  
విద్వత్తు - రాజ్యాధికారం 
శ్లో:-
విద్వత్వంచ

నృపత్వంచ నైవ తుల్యం కదాచన I
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే ॥    
గీ:- పాండితికి సరికాదిల ప్రభుత చూడ
రాజు పూజింపఁబడు తన రాజ్యముననె,
పండితీయుతులెటనైన ప్రతిభ చేత
పూజలందుట నిక్కము భూమిపైన.    
భావము:- 
    పాండిత్యము, రాచరికము ఒకదానితో మరొకటి పోల్చుటకు వీలు లేదు. 
    రాజు

స్వదేశమునందు మాత్రమే పూజింపఁబడును.
    పండితుఁడు (జ్ఞాని) మాత్రము లోకములో ఎక్కడికి వెళ్ళినా పూజింపఁ బడును. 
    కాబట్టి పాండిత్య విషయాలు.    పఠిస్తూ  ఉండాలి. శోధించి తెలుసుకొంటూ ఉండాలి. 
    అప్పుడు పాండిత్యము అలవడకుండా ఎలా ఉంటుంది?  

పీఠం ఆస్తి - ప్రత్యేకత : . . .
 మన పీఠం ఆస్తి, మనం

పొందుతున్నకొద్దీ, మనం దానితో ఆనందాన్ననుభవించడమేకాక, ఇతరులకు దానిని పంచి, మరింత లబ్ధి చేకూరుస్తాం.  ఇది జ్ఞానసంపద. ఆ సంపదని గురువు ద్వారా పొందాలి కదా!  
స్వామి మనకి ఏవిధంగా గురువు? 
    గురుః అంటే అంధకారాన్ని పోగొట్టువాడు. గురువు  అజ్ఞానాంధకారాన్ని తొలగిపోయేలాగు జ్ఞానాన్ని ప్రవేశపెడతాడు కదా!  
/> గురువు - నిర్వచనం 
గురుర్బన్ధురబన్ధూనాం 
గురుశ్చక్షు రచక్షుషామ్ I 
గురుః పితాచ మాతాచ 
సర్వేషాం న్యాయవర్తినామ్ II 
- - - - బంధువులెవరూ లేనివారికి గురువే బంధువు. కళ్ళు లేని వారికి గురువే కంటి చూపు. గురువే తల్లి, గురువే తండ్రి. యదార్థజ్ఞాన ప్రదర్శకుడు. న్యాయమార్గంలో ప్రవర్తింపచేయువాడు "గురువు"  ఆ

గురువు మన స్వామియే కదా!   ఈ గురు పరంపర - వందనం. 
సదాశివ సమారంభాం శంకరాచార్య (వ్యాస - శంకర) మధ్యమాం I 
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్ ॥   

గురు నమస్కారము: . .
శృతి స్మృతి పురాణానాం  ఆలయం కరుణాలయం I  
నమామి భాగవత్పాద శంకరం లోక శంకరం ॥  

శంకరుల పరంపరలో, 
మన విశాఖ శ్రీ శారదా

పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ వారలు గురువులుగా,  "అస్మదాచార్యులు"గా, "శృతి స్మృతి పురాణాం ఆలయం కరుణాలయం"గా, శంకరాచార్యులుగా "నమామి భగవత్పాద శంకరం లోక శంకరం" అనీ నమస్కరిస్తాం.   
వ్యాస - శంకర అద్వైత సంబంధం వ్యాస మహర్షి వేద విభజన

చేసినవారు. 
వారి ఆదేశం మేరకు బ్రహ్మ సూత్రాలకి భాష్యం వ్రాసినవారు ఆది శంకరులు.  
* వ్యాసాయ విష్ణురూపాయ శంకరః శంకరస్సాక్షాత్ 
* శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే . . . వ్యాసుల వారు విష్ణువే!    
    శంకరాచార్యులవారు  శంకరుడే!  శివుడు విష్ణువే! - విష్ణువు శివుడే!
మనం పొందే "భిక్ష".  పీఠంలో

దొంగిలింపబడక, వృద్ధిపొందే "అద్వైత వేదాంతాన్ని" అనే ఆస్తిని, స్వామివారల "జ్ఞాన వైరాగ్య" ఉపదేశాల ద్వారానూ,  వాటిని మన జీవితంలో అభ్యసిస్తూ, స్వామీజీల పర్యవేక్షణలో, శాశ్వత ఆనందాన్నిచ్చే "అద్వైత వేదాంత సంపద భిక్ష"  పొంది, లబ్ధి పొందుతాం.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam