DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇది విశాఖ మాస్టర్ ప్లాన్ కాదు విజయసాయి ప్లానే: మూర్తి యాదవ్ 

*వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై మండిపడ్డ జనసేన కార్పొరేటర్* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 31, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి గా చలామణి అవుతున్న రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కనుసన్నల్లో తయారైన వీఎంఆర్డీఏ 
మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్

కార్పొరేషన్ ( జీవీఎంసీ ) జనసేన పక్ష నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి బృందం అవినీతి , అక్రమాలు, కబ్జాలు, బెదిరింపులు కోసమే  మాస్టర్ ప్లాన్ తయారుచేసినట్లు ఉంది అని ఆగ్రహం  వ్యక్తం చేశారు. వీఎంఆర్డీఏ రూపొందించిన ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ 2041  పూర్తి లోపభూయిష్టంగా ఉంది అని , ఆచరణ సాధ్యం కానిదిగా,

అవినీతికి చిరునామాగా ఉంది అని అభిప్రాయపడ్డారు. వి ఎం ఆర్ డి ఏ రూపొందించిన మాస్టర్ ప్లాన్ 2041 పై నిరసన వ్యక్తం చేస్తూ వి ఎం ఆర్ డి ఏ కార్యాలయం వద్ద జనసేన అద్వర్యం లో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా  మాస్టర్ ప్లాన్ పట్ల వేల సంఖ్యలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని

తెలియజేసారు. మాస్టర్ ప్లాన్ 2041 ను విశాఖ మెట్రో రీజియన్  భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించలేదని  ప్రజలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు.  విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న 60,  80,  వందడుగుల రోడ్లను ఏకంగా 200 అడుగుల రోడ్లుగా ప్రతిపాదించడం నగరంలోని వ్యాపార వర్గాలను కలవరపరుస్తోంది అని అన్నారు. బీచ్ రోడ్ లో

 ఐఎన్ఎస్ కళింగ దాటిన తర్వాత ప్రతిపాదిత 200 అడుగుల రోడ్డు అష్టవంకరలు తిరగటం వెనుక విజయసాయి రెడ్డి బృందం భూ వ్యవహారాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అని అన్నారు. మాస్టర్ ప్లాన్ రూపొందించిన లీ అసోసియేట్స్ ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకొన్నప్పటికీ ,  విజయసాయి రెడ్డి బృందం తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం

పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువచ్చి పూర్తిగా దానిని తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ అమలు జరిగితే విశాఖ రీజియన్ పరిధిలోని లక్షల మంది  భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంది అని ఆందోళన వ్యక్తం చేసారు.  సింగపూర్ ,మలేషియా వంటి దేశాలే రద్దీగా ఉండే పాత టౌన్ లలో రహదార్ల విస్తరణ కు వెళ్ళటం

లేదని  అందుకు విరుద్ధంగా ప్రజల కంటే వారి జీవనం కంటే 200 అడుగుల వెడల్పైన రోడ్ లే  ముఖ్యమైనట్లు ప్లాన్ రూపొందించడం ప్రజలను అవమానించడమే అని అన్నారు.  లక్షలు,  కోట్ల రూపాయల విలువైన భూముల ను మాస్టర్ ప్లాన్ కారణంగా అభివృద్ధి చేసుకోలేని నిస్సహాయ స్థితిలోకి జనం  వెళ్లే ప్రమాదం ఉంది అని అన్నారు. గతంలో వి ఎం ఆర్ డి ఏ

 అనుమతించిన 300 లకు పైగా లే అవుట్ లలో ప్లాట్ లు,  వందల ఏళ్లుగా వున్న కొన్ని గ్రామలు ఈ మాస్టర్ ప్లాన్ కారణంగా అంతర్ధానం కానున్నాయంటే ఇది ఎంత దారుణమైనదో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.  వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదిత మార్పులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు . ప్రజల కష్టాలను దృష్టిలో

వుంచుకొని నవ రత్నాల తో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని మాస్టర్ ఫ్లాన్ బాంబు విశాఖ వాసులపై పడకుండా చూడాలని కోరారు . విజయసాయి కోసం కాకుండా  విశాఖ ప్రాంత ప్రజల భవిష్యత్తు కోసం సరికొత్త మాస్టర్ ప్లాన్ ను  తయారు చేయాల్సిందిగా విజ్ఞప్తి

చేసారు. కొత్త మాస్టర్ ప్లాన్ ను తెలుగు లో  కూడా  ప్రచురించి పంచాయతీ లతోపాటు వార్డు సచివాలయంలో  అందుబాటులో ఉంచాలి అని అన్నారు.  పార్లమెంట్ సభ్యుల నుంచి గ్రామ వార్డు సభ్యుని వరకు అందరినీ భాగస్వాములను చేస్తూ  ప్లాన్ పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలి అని కోరారు .ఈ ధర్నా లో పెద్ద ఎత్తున జనసేన

శ్రేణులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam