DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆస్తిపన్నుపెంపుపై అవగాహన ఇవ్వాలి:మూర్తి యాదవ్

*విశాఖ జనసేన పక్షనేత కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 02, 2021 (డిఎన్ఎస్):* రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నుపై ప్రత్యేక  కౌన్సిల్ సమావేశానికి ముందే కార్పోరేటర్లకు అవగాహన కల్పించాలని గ్రేటర్  విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)  జనసేన

పక్ష నేత పీతల మూర్తి యాదవ్, జనసేన కార్పోరేటర్ దల్లి  గోవిందరాజు డిమాండ్ చేశారు. జీవీఎంసీ కమిషనర్ సృజన ను కలిసి ఈమేరకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మహా విశాఖ నగర పాలక సంస్థలో  ఆస్తి మూలధనం ఆధారంగా పన్నులు పెంచుతున్న నేపథ్యంలో  ఈ పెంపుదల అంశంపై నగర

ప్రజలకే కాక నగర పాలక సంస్థ  ప్రజాప్రతినిధులైన  కార్పొరేటర్లు కూడా పలు సందేహాలు ఉన్నాయన్నారు.  ఏ కేటగిరి లో పన్ను ఎలా పెరుగుతుందో  అన్న దాని మీద స్పష్టత లేదని,.పన్ను  పెంపుదల అంశంపై మహా విశాఖ నగర పాలక సంస్థ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే ముందు ఏ ఏ  క్యాటగరీ లలో   పన్నులు ఎలా  పెరుగుతాయో అన్ప నమూనాను తయారు

చేయాల్సిందిగా విజ్నప్తి చేశారు."  ఖాళీ స్థలాల కు  ఏవిధంగా పెరుగుతుంది?  నివాస గృహాలకు ఏ విధంగా పెరుగుతుంది? వాణిజ్య సంస్థలకు ఏ విధంగా  పెరుగుతుంది? "అనే  అంశాలపై ఒక నమూనా పట్టికను తయారు చేసి కార్పొరేట్లకు వివరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.  విశాఖ జిల్లాలోని  నర్సీపట్నం మున్సిపాలిటీ ఇప్పటికే

పట్టికను తయారుచేసి ప్రజల ముందుంచిందని ఆమెకు వివరించారు. . ప్రజల్లో అపోహలు తొలగించేందుకు ఒక వార్డును  నమూనాగా తీసుకొని అక్కడ ఏ విధంగా పన్నులు పెరిగాయో రూపొందించాల్సిన గా సూచించారు. . ఆ నమూనా పట్టికను 7  వతేదీ ప్రత్యేక సమావేశానికి ముందే  కార్పొరేటర్లకు వివరించడంతో పాటు అందులోని అంశాలను సచివాలయాల్లో

ప్రదర్శించాలని  కోరారు. . వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారని  అందులో భాగంగా ప్రజలు తమ కు వర్తించే పన్నులు  గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  దీన్ని దృష్టిలో ఉంచుకొని పన్నులు ఏవిధంగా పెరుగుతాయి అన్న నమూనా పట్టికను తయారుచేసే ప్రదర్శించాలని  కోరారు.

 రానున్న ఐదు సంవత్సరాలలో ప్రతియేటా ఏ  రకంగా పెరుగుతుందో ఆ పట్టికలో పొందు పరిచి . పన్నుల పెంపకం  కోసం ఏడవ తేదీన ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించే ముందే కార్పొరేట్ల కోసం మరో  సమావేశాన్ని ఏర్పాటు చేసి పవర్  పాయింట్ ప్రజెంటేషన్ చేయించగలరని  విజ్నప్తి చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam