DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా సర్పంచ్  లూ అధికారాన్ని భర్తలకు అప్పజెప్పవద్దు

*శిక్షణ శిబిరంలో విజయనగరం కలెక్టర్ సూర్య కుమారి సూచన*

విజయనగరం, ఆగస్టు 04, 2021 (డిఎన్ఎస్): నూతనంగా సర్పంచ్ లుగా ఎన్నికైన మహిళలు ఎక్కువగా ఉన్నారని, వారిని చూస్తుంటే ఆనందంగా ఉందని, అయితే వారి అధికారాన్నిభర్తలకు అప్పగించకుండా వారే చేయాలనీ విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. శిక్షణ లో

నేర్చుకున్న అంశాలను పాలనలో అమలు చేయాలనీ అన్నారు. జే.ఎన్.టి యు లో జరుగుతున్న సర్పంచ్ ల శిక్షణా ముగింపు   కార్యక్రమం లో బుధవారం కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. సర్పంచ్ అనేది రాజ్యాంగ బద్ధమైన పదవి అని, గ్రామానికి మంచి జరిగినా , చెడు జరిగినా  పూర్తి బాధ్యత సర్పంచ్ లదే నని అన్నారు.  ఉన్నటువంటి వనరులతోనే అభివృద్ధిని

చేయవచ్చని ముందుగా ఆ గ్రామానికి ఏం కావాలో గ్రామ సభల ద్వారా తీర్మానం చేసుకోవాలని, పార్టీల కతీతంగా ప్రజలంతా మనవాళ్ళే అనుకోని పని చేయాలనీ హితవు పలికారు.  మంచి పనులు చేస్తే  సర్పంచ్ మాటకు గ్రామస్తులంత గౌరవిస్తారని, సంక్షేమ పధకాల పై పూర్తి  అవగాహన కలిగించుకొని, పారదర్శకంగా వాటిని ప్రజలకు అందేలా చూడాలని అన్నారు.

 అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేసేలా చూస్తే గ్రామం లోని పిల్లలంతా ఆరోగ్యంగా ఉంటారని, ఆశ వర్కర్స్ ప్రతి రోజు గ్రామానికి వచ్చి ఫీవర్ సర్వే చేస్తే గ్రామస్తులంత ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.  గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో ప్రాధాన్యతలను   పెట్టుకోవాలని, బహిరంగ  మల ముత్రాదుల విసర్జనలు లేకుండా  పరిశుభ్రంగా

ఉండేలా చూడాలని అన్నారు.  శిక్షణ నుండి గ్రామానికి వెళ్ళగానే  జగనన్న  పచ్చతోరణం  క్రింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు.  ఈ సందర్భంగా హర్యానా రాష్ట్రం లో కార్నాల్ గ్రామం లో గ్రామస్తుల శ్రమదానం తో  మురుగు నీరు నుండి మంచి నీరు వచ్చేలా నిర్మించుకున్న 3 రకాల చెరువుల గురించి వివరిస్తూ  ఆ విజయ గాధ

 షార్ట్ ఫిలింను పిపిటి  ద్వారా ప్రదర్శించారు.  ప్రతిది డబ్బు తోనే ముడిపెట్ట కూడదని, ప్రజలంతా ఏకమైతే  శ్రమదానం ద్వారా గ్రామాల అవసరాలను కొన్ని తీర్చుకోవచ్చునని తెలిపారు.  అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా శిక్షణ సర్టిఫికేట్ లను అందజేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam