DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ పై టిడిపి నీచ రాజకీయాలు చేస్తోంది: బీజేపీ ఎమ్మెల్యే విష్ణు

విశాఖపట్నం, జులై 29 , 2018 (DNS Online ): విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కచ్చితంగా జరుగుతుంది అని భారతీయ జనతా పార్టీ శాసన సభ పక్ష నేత, విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గ

ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ప్రకటించారు. ఆదివారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్

ఇస్తామని 
ఎన్నికల సమయం లోనే చెప్పడం జరిగిందని, అది బీజేపీ ఇచ్చిన మాట అని, దాన్ని కచ్చితంగా నెరవేరుస్తుందన్నారు. ఈ విషయమై ఢిల్లీ లో మార్చి 12 2018 న జరిగిన జాతీయ

సమావేశం లో హోం శాఖ అధికారులు నిబంధనల ప్రకారం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదు అని. అయితే దీనిపై రాజకీయ తీర్మానం చేస్తామని బీజేపీ అధ్యక్షులు అమిత్ షా

అప్పుడే తెలిపారన్నారు. ఈ సమావేశానికి విశాఖపట్నం ఎంపీ డాక్టర్ హరిబాబు తో పాటు తానూ కూడా హాజరైనట్టు తెలిపారు. ఇప్పడికే దేశం లో 15 రైల్వే జోన్లు ఉన్నందున

సాంకేతిక పరంగా మరొక రైల్వే జోన్ ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదు అని అధికారులు ఎప్పుడో ప్రకటించారని, ఈ విషయం దేశమంతా తెలుసనీ, అదే విషయాన్ని ఇప్పుడు అధికారులు ఒక

ఎఫిడవిట్ రూపం లో ఇచ్చారన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేస్తోందని, బీజేపీ రైల్వే జోన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంటే టిడిపి కి కడుపు మంట

మొదలైందన్నారు. వీళ్ళు ఆడుతున్న నాటకాలు  à°ªà±à°°à°œà°²à°‚దరికీ తెలుసన్నారు. 
ఇదే విషయాన్ని కేంద్ర హోం శాఖా మంత్రి రాజనాధ్ సింగ్ రాజ్యసభలో ప్రకటించారని, రాజకీయ

తీర్మానం చేసి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని ఆయనే స్వయంగా ప్రకటించారన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపేందుకు బీజేపీ నగర శాఖ

ముఖ్య నేతలు ఢిల్లీ కూడా వెళ్లారన్నారు. à°ˆ సమావేశం లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, ఇతర నాయకులూ పాల్గొన్నారు. 

 

 

#dnslive #dns #VJF #Journalist #Journalists #vizag #visakhapatnam #dnsnews  #dns live #dns media #government #govt

#bjp #mla #vishnu #railway zone

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam