DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ నుంచి రక్షణ కు టీకా ఒక్కటే మార్గం: జస్టిస్ లావు 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 06, 2021 (డిఎన్ఎస్):* కోవిడ్ నుంచి సమాజాన్ని రక్షించాలంటే టీకా ఒక్కటే మార్గమని నిపుణుల అభిప్రాయాలు బట్టి తెలుస్తోందని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ విశ్వవిద్యాలయం లోని సెంటర్ ఫర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్

నిర్వహిస్తున్న రెండు రోజుల మాదిరి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మిస్టీరియల్ కాన్ఫరెన్స్ కు అయన ముఖ అతిథి గా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశం లో ఈక్విటీ ఆఫ్ వాక్సినేషన్ అంటే వాక్సినేషన్ లో అందరి భాగస్వామి లేదా అందరి వాటా అనే అంశం ను చర్చించడం అభినందనీయమన్నారు. 

ప్రపంచం మొత్తం గత ఒకటిన్నర

సంవత్సరం కోవిద్ 19  చుట్టూ తిరుగుతుందని, కోవిద్ 19 ప్రపంచవ్యాప్తంగా 42 లక్షల మంది మరణించారని, ఇండియా లో 4 .2 లక్షల మంది మరణించారని, ఎన్నో దేశాలు మొదటి దశ కోవిద్ ను ఎదుర్కొనే కొన్ని దేశాలు రెండవ దశ, మరియు మూడవ దశలో ఉన్నాయని, కోవిద్ నుంచి ప్రపంచం ను రక్షించాలంటే వాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణుల అభిప్రాయాలు బట్టి

తెలుస్తుందని అన్నారు. ఈ వాక్సినేషన్ ప్రక్రియ ను పరిశీలించి నట్లైతే పేద మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు పోల్చినపుడు  ప్రపంచంలో ధనిక మరియు అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రజలలో ఎక్కువ మందికి వ్యాక్సిన్ ను ఇవ్వగలిగాయని అదే సమయం లో ధనిక దేశాలు ఎక్కువ వాక్సిన్ డోస్లు అందుబాటులో ఉన్నాయని, కాని పేద దేశాలకు తగినన్ని

వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేవని, సోమాలియా లాంటి పేద దేశాల్లో వాక్సిన్లు వేసేందుకు తగిన సిబ్బంది, మరియు సదుపాయాలు కూడా లేవని అంటూ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేపట్టిన కోవిక్స్ ప్రోగ్రాం అనేది  అన్ని దేశాలకు ఉత్పత్తి ఐన వ్యాక్సిన్ ను అన్ని దేశాలకు అవసరాలకు తగినట్లుగా సరఫరా చేసేందుకు చేపట్టారని, కానీ కార్యాచరణ

లో ఇది విఫలమైందని అన్నారు. అందువల్ల ఉత్పత్తి ఐన వాక్సిన్ లో 85 శాతం ధనిక దేశాలకే వెళుతున్నది, పేద దేశాలు వ్యాక్సిన్ డోసులు అందక ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
ఐ లాంటి  వాటిని నివారించేందుకు ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా దేశాలు మేధోహాక్కులను ఉపసంహరించాలని  వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గర ప్రతిపాదించాయని, కానీ

ప్రతిపాదన ను ధనిక దేశాలు తిరస్కరిచాయనితెలుపుతూ, కానీ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డిక్లరేషన్ లోని ఆర్టికల్ 9 (౩), 9 (4), అనేవి  అనుకోని మరియు అత్యవసర పరిస్థితులలో మేధో హక్కుల రద్దు చేయవచ్చు అని తెలుస్తున్నదని, ఆంటీ కాకుండా  త్రిపీస్ ఒప్పందం లోని సెక్షన్ 31 (F )  కూడాఅత్యవసర పరిస్థితులలో మేధో హక్కులను రద్దు చేయవచ్చు అని

తెలుపుతున్నాయని అందువల్ల ఇండియా మరియు ఆఫ్రికా దేశాల ప్రతిపాదనను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్ అంగీకరిస్తే పేద దేశాలకు ఎంతో ఉపయోగకరం గా ఉంటుందని అభిప్రాయం పడ్డారు. ఎలాంటి మేధో హక్కుల మీద ఈ రెండు రోజుల సమావేశాల్లో చర్చించాలని సూచించారు.  అందరికీ  వ్యాక్సిన్ ను అందుబాటులోకి రావడం అందరి లక్ష్యం కావాలని ఆ దిశగా అన్ని

దేశాలు సహకరించు కోవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కే. మధు సుధా రావు, ప్రోగ్రాం డైరెక్టర్ డా. శ్రీ సుధా, P J నాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam