DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో ఇంటర్మీడియట్ ఫలితాల ప్రకటన

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, ఆగస్టు 06, 2021 (డిఎన్ఎస్):* ఏపీలో కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫస్టియర్ విద్యార్థులందరినీ మినిమం పాస్ మార్కులతో సెకండియర్ లోకి ప్రమోట్ చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి

వి.రామకృష్ణ తెలిపారు . ఇటీవల ఇంటర్ అడ్వాన్స్ ' సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన నేపథ్యంలో విద్యార్థులు , వారి తల్లిదండ్రులకు ఉన్న పలు సందేహాలను నివృత్తి చేస్తూ గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు . రెగ్యులర్ సెకండియర్ ( 2020-2021 ) పూర్తి చేసిన విద్యార్థులకు .. - ఐపీఈ మార్చి 2021 కు పరీక్ష ఫీజు చెల్లించిన

విద్యార్థులు .. వారి ఫస్టియర్ , సెకండియర్ మార్కులు పెంచుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చు . • ప్రాక్టికల్ మార్కులను పెంచుకోవడానికి మాత్రం అవకాశం లేదు . " ఐపీఈ మార్చి 2021 లేదా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఎందులో ఎక్కువ మార్కులు వస్తే వాటినే పరిగణనలోకి

తీసుకుంటారు . - ప్రైవేటు విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించి హాజరుకావచ్చు . • హాజరు మినహాయింపు కేటగిరీలోని విద్యార్థులు కూడా ఫీజు చెల్లించి ఈ పరీక్షలకు హాజరుకావాలి . * విద్యార్థులంతా ఎథిక్స్ , హ్యూమన్ వ్యాల్యూస్ , ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షల్లో క్వాలిఫై అవ్వాలి . అలా కాని వారు ఈ

పరీక్షలకు ఫీజు చెల్లించి తమ సుముఖతను తెలపాలి . • ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు , గైర్హాజరు అయినవారు పరీక్ష ఫీజు చెల్లించి ప్రాక్టికలకు హాజరుకావాల్సి ఉంటుంది . రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులకు ... - 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్ లో చేరి ఐపీఈ - మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులందరూ

మినిమం పాస్ మార్కులతో సెకండియర్ లోకి ప్రమోట్ అవుతారు . 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam