DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయనగరం జిల్లాలో 32 వేల‌ మందికి టీకా 

*విజయనగరం, ఆగస్టు 06, 2021 (డిఎన్ఎస్):* విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఒక్క‌రోజే ఏకంగా  32వేల మందికి పైగా కోవిడ్ వేక్సిన్ వేశారు. వేక్సినేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్‌లో భాగంగా, ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా యంత్రాంగం చేసిన వేక్సినేష‌న్‌ ఏర్పాట్ల‌కు ప్ర‌జ‌ల‌నుంచి భారీ స్పంద‌న

వ్య‌క్త‌మ‌య్యింది.  గ‌రివిడి మండ‌లం తోండ్రంగి గ్రామంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి ప‌ర్య‌టించి, వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించారు. గ్రామంలోని గర్భిణీలంద‌రికీ వేక్సినేష‌న్ పూర్తిచేయాల‌ని సిబ్బందిని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో  జాయింట్ క‌లెక్ట‌ర్

(అభివృద్ది) డాక్ట‌ర్ ఆర్‌.మ‌హేష్‌కుమార్ జామి మండ‌లంలో, జాయింట్ క‌లెక్ట‌ర్ (ఆస‌రా) జె.వెంక‌ట‌రావు గంట్యాడ మండ‌లంలో, ఐటిడిఏ పీఓ ఆర్‌.కూర్మ‌నాధ్ మ‌క్కువ మండ‌లంలో, పార్వ‌తీపురం స‌బ్‌క‌లెక్ట‌ర్ భావ‌న‌, పార్వ‌తీపురంలో,  కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి

ర‌మ‌ణ‌కుమారి, ఇత‌ర వైద్యాధికారులు, మండ‌ల ప్ర‌త్యేకాధికారులు, ఎంపిడిఓలు ఈ కార్య‌క్ర‌మాన్నిత‌మ ప్రాంతాల్లో ప‌ర్య‌వేక్షించారు.

జిల్లాలోని గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని అన్ని స‌చివాల‌యాల్లో శుక్ర‌వారం వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కోవిషీల్డ్‌తో బాటు, కోవేగ్జిన్ కూడా

మొద‌టి రెండు డోసులు వేశారు. ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌కు అనుగుణంగా ఈ స్పెష‌ల్ డ్రైవ్లో 45 ఏళ్లు పైబ‌డిన సామాన్య ప్ర‌జ‌లంద‌రికీ, వ‌య‌సుతో సంబంధం లేకుండా ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు, ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ఉపాధ్యాయుల‌కు, బ్యాంకు ఉద్యోగుల‌కు, గ‌ర్భిణీల‌కు, 5ఏళ్ల‌లోపు పిల్ల‌లున్న త‌ల్లుల‌కు

వేక్సిన్ వేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam