DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరిజన సంస్కృతిని రక్షించుకుందాం : వీసీ కట్టిమణి

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, ఆగస్టు 09, 2021 (డిఎన్ఎస్):* గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు అందరూ పాటుపడాలని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వీసీ ఆచార్య టి.వి.కట్టిమణి అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరం మరియు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం సంయుక్త ఆధ్వర్యంలో

ఇంటర్నేషనల్ ట్రైబల్ డే సెలబ్రెషన్ – 2021 ను సోమవారం ఆన్ లైన్ ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వీసీ ఆచార్య టి.వి.కట్టిమణి మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. భూమిపై జీవిస్తున్న 80 కోట్ల జీవరాశులలో మానవుడు ఒక భాగం,

అయినప్పటికి మానవుడు ఇతర జీవరాశుల మనుగడకు ఎక్కువ హాని చేకుర్చుతున్నారని అన్నారు. గిరిజనుల సంస్కృతి ఎంతో ప్రత్యేకమైనదని, వారి కమ్యూనికేషన్, భాష, అలవాట్లు ఎంతో ప్రముఖ్యతను సంతరించుకున్నాయని తెలిపారు. ఆధునిక మానవ జీవన విధానం కంటే గిరిజన జీవన విధానం ఎంతో మేలుకరంగా ఉంటుందని చెప్పారు. ప్రకృతినే దేవునిగా భావిచి

ప్రకృతి హితంగా, ప్రకృతి పరిరక్షణకు పాటుపడతారని తెలిపారు. రిజిష్ట్రార్ ఆచార్య టి.అశోక్ మాట్లాడుతూ పుట్టిన ప్రాంతంలోని సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువను పెంచుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఎస్సీ,ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ డా.పి.విజయనిర్మల, డా.డి.కళ్యాణి, డా.పి.వెంకటేశ్వరరావు, ఈసీ మెంబర్ ఆచార్య

కె.శ్రీరమేష్, డా.బి.జగన్మోహనరెడ్డి, ప్రిన్సిపాల్స్ డా.కె.రమణేశ్వరి, డా.వి.పెర్సిస్, డా.డి.జ్యోతిర్మయి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పరిపాలన అధికారి డాఎన్.వి.ఎస్..సుర్యనారాయణ, డా.వరహాలన దొర, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam