DNS Media | Latest News, Breaking News And Update In Telugu

Hindus protest to obstruct illegal church in Kakinada

*హిందువుల ఇళ్ల మధ్య చర్చ్ ఏంటి? : కాకినాడ స్థానికులు* 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి /కాకినాడ , ఆగస్టు 09, 2021 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలో రమణయ్యపేట, ఈశ్వర్ కాలనీలో కోర్ట్ ఆదేశాలకు విరుద్ధంగా హిందువుల నివాసాల మధ్య  అక్రమంగా చర్చి నిర్మాణం కొనసాగించడం

చేస్తుండటంతో స్థానికుల అండగా భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ సభ్యులు ఆందోళన చేపట్టారు. హైందవ సంఘాల పిలుపు మేరకు శనివారం ఘటన స్థలాన్ని సందర్శించినట్టు బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర సభ్యుడు విజయ్ శంకర్ ఫణి తెలిపారు. 

అక్కడ జై శ్రీరామ నినాదాల చేసి  స్థానికులతో మాట్లాడి భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఈ

విషయాన్ని తెలియ చేస్తామని  న్యాయ పోరాటానికి ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ ఉంటుంది అని వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి బయలు దేరి వెళ్లారు. అనంతరం మాట్లాడుతూ స్థానికుల అనుమతి లేకుండా చర్చ్ నిర్మాణం చేయరాదని, అలాంటిది స్థానికులు ఈ చర్చ్ నిర్మాణాన్ని నిలుపుదల చెయ్యాలంటూ

హైకోర్టును ఆశ్రయించగా తొలగించమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా కొందరు నేతల మద్దతుతో మళ్లీ చర్చి కట్టడం మొదలుపెట్టారన్నారు. దీంతో స్థానికులు  ప్రభుత్వ అధికారులకు తెలియ పరచడం జరిగింది. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన చేసి  కలెక్టర్, ఆర్డిఓ లకు వినతిపత్రం ఇచ్చి కోర్టు ఉత్తర్వులను కూడా

తెలియచేయడం జరిగిందన్నారు. 

హిందువుల ఇళ్లమధ్య చర్చ్ ఎలా కడతారు?

కాకినాడలోని రమణయ్య నగర్, శ్రీరామ్ కోలనీలో హిందువుల ఇళ్లమధ్యలో నిరంతరం హిందువుల దూషించే వ్యక్తుల కోసం చర్చ్ ఎలా కడతారు అని స్థానికులు మండిపడుతున్నారు. ఇదే కాకినాడ వీధుల్లో పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి హిందూ దేవీ దేవతలను

నిస్సిగ్గుగా దూషిస్తే. .ఈ ప్రభుత్వ పాలకులు, అధికారులు, చట్టాలు ఎందుకు చర్య తీసుకోలేదు అని ప్రశ్నించారు.  

ఈ నిరసనల్లో భాజపా కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, భాజపా రాష్ట్ర మహిళా నాయకురాలు పద్మ, వివిధ హైందవ సంఘాల నాయకులు స్థానిక భాజపా నాయకులు  అనేకమంది పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam