DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*సింహాచలం ఉపాలయంలో ధ్వజస్థంభం కూలడం నిర్లక్ష్యమే*. .

*మీడియా గతంలోనే కధనాలు ఇచ్చినా సిబ్బంది బేఖాతరు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

విశాఖపట్నం ఆగస్టు 11 2021 (డి ఎన్ ఎస్): ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ లోని ఉపాలయం మైన శ్రీ సీతామచంద్ర స్వామి ఆలయం లో ధ్వజస్థంభం కూలడం పూర్తిగా ఆలయ అధికారులు, వైదిక

సిబ్బంది నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. శిధిలమైన ఈ ధ్వజస్థంభం బుధవారం ఉదయం  ఒక్కసారిగా విరిగి పడింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో కూడా కనిపించాయి. అయితే పురాతనమైన ఈ ధ్వజస్థంభం శిథిలమవుతోంది అంటూ మీడియా లో పలు కధనాలు, గతంలోనే ప్రచురించి, ఆలయ అధికారులను హెచ్చరించినా పట్టించుకున్న నాధుడే లేదు. గతంలో అక్కడ ఆలయంలో

విధులు నిర్వహించిన వైదిక సిబ్బంది సైతం ఈ విషయాన్నీ పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం గమనార్హం. 

ఆలయంలో వేల రూపాయల్లో వేతనాలు తీసుకునే  అర్చక సిబ్బంది, సహాయకులు, లక్షల్లో జీతాలు తీసుకునే సూపర్వైజర్లు, అర్చకేతర సిబ్బంది చాలామందే ఉంటారు. అయినప్పటికీ ఈ ఘటనా జరగడం ఆలయం పట్ల సిబ్బంది కి ఉన్న భాద్యతలు

సుస్పష్టంగా కనపడుతున్నాయి. 

తాత్కాలిక ధ్వజ స్థంభం ఏర్పాటు. . .

ఘటన జరిగిన విషయం తెలుసుకున్న వైదిక సిబ్బంది వెంటనే స్పందించి శిధిల మైన ధ్వజ స్థంభం స్థానంలో తాత్కాలిక ఏర్పాటు చేసారు. త్వరలోనే శాశ్వత ధ్వజ స్థంభం ఏర్పాటు కానుంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam