DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మద్దతు ధరలేక పంటను కాల్వలో పోసిన రైతులు 

*విశాఖ జిల్లా దేవరపల్లి లో రైతుల దయనీయ స్థితి.* 

*విశాఖపట్నం, ఆగస్టు 14, 2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి లోని హాల్ సేల్ గాయగూరలు మార్కెట్ లో గిట్టుబాటు ధరలేక రైతులు తాము పండించిన కాయగూరలు రైవాడ కాలువలో పారవేయడం అందరిని కలిచివేసింది. శనివారం ఉదయం స్థానిక మార్కెట్ లో విక్రయించేందుకు

చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు రావడం జరిగింది. అయితే దళారీ ల ఆధిపత్యం కారణంగా వీరి పంటకు కనీస మద్దతు ధర లభించక పోవడంతో మనస్థాపానికి గురైనట్టు సమాచారం. పాడేరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుండి వస్తున్న పెద్ద వ్వపారులను అడ్డు కోని స్థానిక వ్యపారులు సిండికేట్ కా ఎర్పడి రైతులను మోసంచేస్తున్న

వైనం కనిపిస్తోంది. గత ఆరవైసంవత్సరాలు నుండి కోనసాగుతున్న దేవరాపల్లి కాయగూరల మార్కెట్ లో వీరు పంటలను విక్రయిస్తున్నారు. 

వేపాడ ఆనంతగిరి దేవరాపల్లి చీడికాడ మండలాలుకు చేందిన రైతులు కాయగురాలు పండించి తెస్తున్నకొనేవాడే కరువు అయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వ

పూర్తిగా వైపల్యం చెందినట్టు తెలుస్తోంది. కోల్డ్ స్టోరిజి కట్టాలని మార్కెట్ సౌకర్యం కల్పించాలని మధ్ధతు ధర ఇవ్వాలని రైతులును ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam