DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహానీయులను స్ఫూర్తిగా విద్యార్థుల జీవనం సాగాలి 

*నారాయణ హైస్కూల్ లో స్వాతంత్య్ర దిన వేడుకలు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 15, 2021 (డిఎన్ఎస్):* భారత దేశ స్వాతంత్య్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను స్ఫూర్తిగా విద్యార్థులు తమ జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, నారాయణ పాఠశాలల ఏ జీ ఎం జి. రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం

సీతమ్మధార లోని నారాయణ హైస్కూల్ లో 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన విద్యార్థులకు తగు సూచనలు చేసారు. తమ విద్యా విధానం లో భారత జాతి కి సేవ చేసిన మహనీయుల జీవన విధానాన్ని విద్యార్థులకు తరుచుగా తెలియచేయడం జరుగుతోందన్నారు. సంస్థ ప్రిన్సిపాల్ డోలా అఖిల ఆధ్వర్యవం లో 
స్వాతంత్య్ర

దినోత్సవ వేడుకల్లో జాతీయ జండా ను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, వకృత్వ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమం లో సంస్థ ఆర్ ఐ రఘుబాబు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీలు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam