DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిద్ లో సేవలకు అక్షయ పాత్ర అభినందనలు

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 15, 2021 (డిఎన్ఎస్):* కోవిడ్ కష్టకాలంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ విస్తృతంగా చేపట్టిన సేవ కార్యక్రమాలకు అభినందనలు తెలియచేస్తూ 75 వ  స్వత్రంత్ర  దినోత్సవ వేడుకల్లో ప్రశంస పత్రం అందించారు. విశాఖపట్నం లో ఆదివారం జిల్లా అధికార యంత్రాంగ ఆధ్వర్యవంలో జరిగిన వేడుకల్లో

ఆంధ్ర ప్రదేశ్  వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు కురసాల కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఏ. మల్లికార్జున్,  పోలీస్ కమీషనర్ మనీష్ సిన్హా లు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి అంబరీష దాస కు అందించారు. 

అక్షయ పాత్ర ఫౌండేషన్ విశాఖపట్నం లో  రెండు కేంద్రీయ వంటశాలలు కలిగి యున్నాయని, కోవిద్ కష్టకాలంలో

మార్చి 2020 నుంచి నేటి వరకు ప్రతి రోజు భోజనము తయారు కావించి ప్యాకెట్ ను తమ భోజన వాహనముల ద్వారా విశాఖపట్నములో  25 ప్రదేశాలు (హాస్పిటల్స్ లో రోగి సహయకులు కొరకు, బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, నిరాశ్రుయులు, రోజువారీ కూలీల కొరకు) భోజన పంఫిణీ కేంద్రాల ద్వారా వితరణ చేసారు. 

భోజనము పాకెట్స్ కాకుండా  ఫ్రెంట్ లైన్

వారియర్స్ , పేదవారికొరకు  నిత్యావసర డ్రై రేషన్ కిట్స్,స్కూల్ స్టూడెంట్స్ కొరకు హప్పినెస్స్ కిట్స్  పంపిణి చేసారు. 

కోవిద్ -19 : ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు మొదటి దశలో విశాఖపట్నంలో  పంపిణి కావించిన భోజనాలు  5,67, 345, స్కూల్  స్టూడెంట్స్  కొరకు పంపిణి కావించిన హప్పినెస్స్ కిట్స్  21111   మరియు  పంపిణి

కావించిన  డ్రై రేషన్  కిట్స్ 16,697     వివరాలు

కోవిద్ -19:  ఏప్రిల్ 2021 నుంచి ఆగష్టు 2021 వరకు రెండవ దశలో పంపిణి కావించిన భోజనాలు 7,41, 986,  స్కూల్ స్టూడెంట్స్  కొరకు పంపిణి కావించిన హప్పినెస్స్ కిట్స్ 6757     మరియు  పంపిణి కావించిన  డ్రై రేషన్ కిట్స్ 30563 . 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam