DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవ జీవన వ్యవస్థకే మార్గ దర్శి పెద్ద జీయర్ స్వామి

*అవమానించిన చోటే రామాయణానికి పట్టాభిషేకం*  

*దేశ వ్యాప్తంగా 108 శ్రీరామ క్రతు స్తూపాల ప్రతిష్ట. ..* 

*సొంత భూమిలో దేశంలోనే మొదటి హరిజన కోలనీ నిర్మాణం* 

*పెద్ద జీయర్ స్వామి తిరునక్షత్ర సందర్బంగా ప్రత్యేక కథనం*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 25, 2021

(డిఎన్ఎస్):* యావత్ మానవాళికి మరదర్శిగా నిలిచినా మహనీయుల్లో అగ్రగణ్యులు పెద్ద జీయర్ స్వామి. విశిష్టాద్వైతం సంప్రదాయం లో జీయర్ అనగానే వెంటనే స్ఫురించే మహనీయులు త్రిదండి రామానుజ పెద్ద జీయర్ స్వామే. వీరికి సత్య సంకల్ప అని పేరు. ప్రస్తుతం చిన్న జీయర్ గా విశ్వ ఖ్యాతి గాంచిన చిన్న జీయర్ స్వామికి ఆచార్యులు, పూర్వాశ్రమ

పితామహులు. vaaru స్థాపించిన పీఠాన్ని నేడు విశ్వవిఖ్యాతం చేస్తున్నారు.  
శ్రావణ మాసం ఉత్తరాభాద్ర నక్షత్రం పెద్ద జీయర్ స్వామి ఆవిర్భవించిన రోజు. 

దేశ వ్యాప్తంగా 108 శ్రీరామ క్రతు స్తూపాల ప్రతిష్ట. .. 

భారత దేశ వ్యాప్తంగా నేడు ఏ ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రం దర్శించినా అక్కడ ఒక శ్రీరామ స్తూపం

కనపడుతుంది. మన ఆంధ్ర ప్రదేశ్ లో తిరుమల, సింహాచలం ఆలయాల్లో కూడా ఈ శ్రీరామ స్తూపాలు ప్రతిష్ట చేసారు. వీటి ఏర్పాటు కు ఒక మహత్తరమైన ఘటన ఉన్నది.  

తమిళనాడులో పెరియార్  హవా ఉద్ధృతంగా నడుస్తున్న కాలంలో శ్రీరామాయణ మహాకావ్యాన్ని చింపి రోడ్ల మీద పారేశాడు. చాలామంది పెద్దోళ్లకు తెలిసినా పెరియార్ కి భయపడి తమిళనాడు

లోని వైదిక సంప్రదాయపరులు అందరూ నోళ్లు మూసుకున్నారు. 

ఈ మహా ఘోరం తెలిసిన వెంటనే పెద్దజీయరుస్వామి వారు ఏ రోడ్ల మీద చింపేశాడో అదే రూట్లో 27 రోజుల పాటు నిత్య శ్రీరామాయణ మహా కావ్యాన్ని పారాయణం చెయ్యాలి అని సంకల్పం చేసి, అందరిని ఆహ్వానించారు. అయితే ఒక్కరు కూడా ముందుకు రాక పోవడంతో జీయర్ స్వామి వారే ఒక్కరు

రామాయణ పారాయణ ఆరంభించారు. 

అది మొదలు తొమ్మిదేళ్లపాటు అఖండముగా యావత్భారతంలో శ్రీరామాయణ మహాక్రతువులతో పాటు 108  శ్రీరామస్థూపాలను ప్రతిష్ఠ చేశారు. నేటికి ఆయా ప్రాంతాల్లో ఆనాటి వైభవ చిహ్నంగా విరాజిల్లుతున్నాయు ఆ స్థూపాలు.

ఎక్కడైతే శ్రీ రామాయణం గ్రంథ దహనం జరిగిందో  అదే ప్రదేశంలో అష్టోత్తరశత

 శ్రీసీతరామకళ్యాణములు , శ్రీరామపట్టాభిషేకం, శ్రీరామాయణపారాయణలతో కూడిన 
శ్రీరామమహాక్రతువును నిర్వహించాలి అనుకున్నారు. ఏ ఒక్కరు సహాయం అందించలేదు
అశ్రయం ఇవ్వలేదు వారికి అప్పట్లో ఆ రాక్షసుడికి భయపడి ఈ కార్యక్రమము కోసం ఎవ్వరు ముందుకు  కూడా రాలేదు. కానీ పెద్ద జీయర్ స్వామివారి సంకల్పం చాలా గొప్పది. ఎవరో

ఎందుకు రాముడే అండగా వున్నాడు అనుకున్నారు, తాను ఒక్కరే ప్రారంభం చేశారు రామాయణ పారాయణం. ప్రజలలో ఆలోచన చిగురించసాగింది నెమ్మదిగా ఈ మహా కార్యాన్ని తమ చేయూత ఇస్తాము అని వచ్చిన  300 మంది పండితులతో  27 రోజుల పాటు రామాయణ పారాయణం ఎక్కడ అయితే రామాయణ దహనం చేశారో అక్కడే నిర్వహించారు పెద్ద జీయర్ స్వామివారు. కొందరిలో చలనం

వచ్చింది, ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు వచ్చారు, ఈ 300 మంది పండితులకు ఆశ్రయం ఇచ్చింది అప్పట్లో మద్రాస్ నగరంలోని  బ్రహ్మణేతరులే. మొదటిలో స్థానికులు భయంతో సహాయ నిరాకరణ చేసినా స్వామివారి సంకల్పానికి ఆశ్చర్యచకితులై అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. 
1960 నుండి1969 వరకు ఈ దోషానికి ప్రాయశ్చిత్తంగా తొమ్మిది సంవత్సరాల పాటు 108

శ్రీరామ క్రతువులనుచేశారు పెద్ద జీయర్ స్వామి వారు. ఒక్కొక్క యాగము 27 రోజుల పాటు జరిగేది.  చిన్న, పెద్ద భేదము లేకుండా అందరి చేత రామనామాన్ని రాయించి శ్రీ రామాయణ శ్లోకాలతో హవనమును జరిపి  ఎక్కడ యజ్ఞం చేశారో అక్కడ రామ స్థూపాన్ని నిర్మించేవారు. అలా భారతదేశమంతా  శ్రీరామ క్రతువు జరిపి రామ స్థూపాలను నిర్మించారు. 
/> అలాగే నేపాల్లో కూడా  రెండు రామకృతువులను జరిపారు. తిరుపతిలో చిట్టచివరి శ్రీరామ క్రతువు జరిపి రామక్రతు స్తంభాలను నిర్మించారు. ప్రతిచోటా రామ నామము స్మరించేలా చేశారు స్వామివారు ఎక్కడ చూసిన రామ మాయం. అంతా సనాతన ధర్మ రక్షకుల జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ జయ జయ ధ్వనులు. ఆ సమయంలో ఎవ్వరు చెయ్యని సాహసం,  శ్రీరామనామమునకు

పట్టాభిషేకం పెద్ద జీయర్ స్వామివారు చేశారు.

మొదటి క్రతువునాటి #మథితాగ్నిహోత్రం ఆరకుండా తొమ్మిదేళ్ల పాటు 108 క్రతువులు..
భారతదేశం వివిధప్రదేశాలలో.. ఒక్కొక్కక్రతువు 27 రోజులపాటు . .దీక్షతో.. సామాన్యులతో రామకోటి లేఖనం , . .విద్వాంసులచే రామాయణం పారాయణం , . . ఋత్విక్కులచే రామషడక్షరీసంపుటిత . .సంపూర్ణ శ్రీ రామాయణ

శ్లోకహవనం , . .మహనీయులచే ప్రవచనములు.. . .ఇలా అపూర్వమైనరీతిలో అనితరసాధ్యంగా...పెదజీయర్ స్వామివారి సనాతనధర్మప్రచారం.. చరిత్రమరువలేనిది..మరువరానిది.

వారు స్థాపించిన స్తూపాలు ఇవే. . .

1.  నడిగడ్డ పాలెం , 2.  చుండూరు., 3. చీరాల , 4.  చావలి, 5 .  లింగవరం, 6. పునికిలి, 7.  గుడివాడ, 8. విశాఖపట్నం, 9. కొత్తూరు, 10. శ్రీకూర్మం, 11.

 పూసపాటి రేగ, 12.  పెద్ద తోట వాడ, 13.  చాట్రాయి, 14 .  పోతునూరు( బి), 15.   భీమవరం, 16.  సింహాచలం, 17.  బదరికాశ్రమం, 18.  హనుమాన్ చట్టి, 19.  తిరువూరు, 20.  మంగళగిరి, 21.  కవుతరం, 22.  సంపత్కుమారపురం, 23.  మచిలీపట్నం, 24.  పూరిజగన్నాథ్, 25.  కటక్, 26. ఆముదాలవలస, 27.  పాలకొండ, 28.  విజయవాడ, 29.  విజయవాడ(బి), 30 .   ఏలూరు, 31.  కల్వపాముల, 32 .  కోరుకొండ, 33.

తంటికొండ, 34.  అర్తమూరు, 35.  అనపర్తి, 36.   విజయనగరం, 37.   బొబ్బిలి, 38.  శ్రీ రామ తీర్థం, 39.   శ్రీకాకుళం, 40 .   బరంపురం, 41. గోపాలపురం, 42. ఇచ్చాపురం, 43.  బరంపురం(బి), 44.  నాసిక్, 45.   శిఖా, 46.   ద్వారక, 47.   ఉజ్జయిని, 48.  కురుక్షేత్రం, 49.   భీమాళి, 50. అనకాపల్లి, 51.   నెల్లూరు, 52.   జనకపూర్, 53.   సీతామణి, 54.   అహల్యాస్థాన్, 55.   దేవఘాట్ నేపాల్,

56.  ముక్తినాథ్ నేపాల్, 57. గయ, 58.  బక్సర్, 59.  హరి ద్వారము, 60.   రంగాపురం, 61.  రామేశ్వరం, 62 .   వానమామలై , 63.    శ్రీరంగం, 64.   మద్రాసు, 65.  ట్రిప్లికెన్ మద్రాసు, 66.  కంచి, 67.  మధురై, 68.   రిషికేశ్వరం, 69.  పాండుకేశ్వరం, 70.   ఢిల్లీ, 71 .   మిశ్రీ,  72 .  నైమిశారణ్యం, 73 .   విట్టురువాల్మీకి ఆశ్రమం, 74 .   చిత్రకూటం, 75  .   భద్రాచలం, 76 .  

భద్రాచలం బి, 77 .  భద్రాచలం, 78 .   పర్ణశాల, 79 .   హైదరాబాదు ఐడిపిఎల్, 80.    అనంతవరం, 81.   మానుకోట, 82.  బొంబాయి, 83.  నాసిక్, 84.  పాలకొల్లు, 85.  ఆకివీడు, 86.  ఖమ్మం, 87.  వరంగల్,  88.  వరంగల్. బి, 89. కిషన్ దాస్ యల్లారెడ్డిపేట, 90 .   నిజామాబాద్, 91.  వారణాసి, 92. బృందావనం, 93.  పుష్కర్,  94.  జయపూర్, 95.   ఫిరోజాబాద్, 96.  కాశ్మీర్, 97.    కాశీ, 98.

  అయోధ్య, 99.     హంపి, 100 .   రాజమండ్రి, 101.    ఉప్మాక, 102.   ప్రయాగ, 103.  గుంటూరు, 104.  వానపాముల, 105 .   పోతునూరు, 106.   అలిమేలు మంగాపురం, 107 .  తిరుపతి, 108 .  తిరుమల.

సొంత భూముల్లో హరిజనులకు 124 ఇళ్ల కట్టి ఇచ్చింది వేరే  

వీరు స్వాతంత్య్ర పోరాట ఉద్యమకారులు. aa ఉద్యమంలో భాగంగానే తమ స్థిరాస్తులను పేదలకు ధారాదత్తం

చేసేసారు. దేశం మొత్తం మీద మొట్ట మొదట సారిగా తమ సొంత భూముల్లో 124 హరిజనుల కుటుంబాలకు ఇల్లు nirminchina మహనీయులు పెద్ద జీయర్ స్వామివారే. 1938, లో తమ స్వస్థలమైన  తూర్పు గోదావరి జిల్లాలోని అర్తమూరు గ్రామం లో 124 మంది పేద హరిజన కుటుంబాల వారికి తమ సొంత భూమిలో ఇళ్ళు నిర్మించి ఇచ్చిన ఉదారులు వీరే. నేడు అదే కోలనీ హరిజన వాడగా

పిలువబడుతోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam