DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*బ్రాహ్మణా కశ్యప పెన్షన్లకి గోవిందా కొట్టేసినట్టే . .నా?*

*బ్రాహ్మణ కార్పొరేషన్ ఉండి బ్రాహ్మణులకు ఉపయోగం ఏంటి?*

*గగ్గోలు పెడుతున్న లబ్ధిదారులు, చేతులెత్తేసిన సంఘాలు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 25, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా, ఆర్భాటంగా 2016 లో ప్రారంభించిన ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ లో అన్ని

పథకాలు జావగారిపోగా. . . చిట్టచివరగా మిగిలిన కశ్యప స్కీం కి కూడా మంగళం పడేందుకు పూర్తి ప్రణాళిక సిద్ధమైందని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. 
ఒక ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ వస్తోంది అనే సాకు చూపించి, ఒకరి పెన్షన్ ను తొలగిస్తున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికి నోటీసులు ఇస్తున్నారు. దీంతో లబ్ధిదారులు

గగ్గోలు పెడుతున్నారు, బ్రాహ్మణ సంఘాలు దాదాపు చేతులెత్తేశాయి. 

అత్యంత పేదరికంలో బ్రతకడానికి కూడా కష్టంగా ఉన్న బ్రాహ్మణ వృద్దులకు జీవన భృతి కోసం ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ 2016 నుంచి అందిస్తున్న పథకం కశ్యప స్కీం. దీని ద్వారా 60 ఏళ్ళ వయసు దాటినా పురుష, మహిళా బ్రాహ్మణుల్లో అర్హులైన వారికి అందరికి

నెలకు రూ.  2250 /- ఉపకార భృతి అందిస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ను పెట్టి, ఏటా నిధులను కేటాయిస్తోంది. ఈ కార్పొరేషన్ ద్వారా విద్యార్థులకు సైతం ఉపకార వేతనం వచ్చేది. 

ఇది రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లింక్ పెట్టలేదు. అయితే ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం లో నడుస్తున్న బ్రాహ్మణ

కార్పొరేషన్ నుంచి వచ్చే పథకాలను పూర్తిగా నిలుపుదల చేసి, కశ్యప స్కీం ను ప్రభుత్వ స్కీం కు అటాచ్ చేశారు. దీంతో ఈ లబ్దిదారులకు బ్రాహ్మణ కార్పొరేషన్ కు కేటాయించిన నిధులనుంచి ప్రతినెలా భృతి ఇస్తున్నారు. ఇదే ఇంట్లో ఇంకెవరికైనా ప్రభుత్వం నుంచి భృతి ( బ్రాహ్మణ కార్పొరేషన్ అయినా, కాకపోయినా సరే) వస్తున్నట్టు అయితే, ఒకటి

రద్దు చేసుకోవాలి అనే నోటిస్లు ఇచ్చారు. లేనిపక్షంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పెన్షన్ ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ నోటీసులు ఇచ్చేందుకు వచ్చే వాలంటీర్లు లబ్దిదారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బ్రాహ్మణులకు

మేమె న్యాయం చేస్తున్నాం అని చెప్పుకునే బ్రాహ్మణ సంఘాల నేతలు ఈ స్కీం పై నోరెత్తలేక చేతులెత్తేశారు. దీనిపై కొన్ని ప్రాంతాల్లో స్థానిక అధికారులకు వినతి పత్రం అందిస్తున్నారు. 

దీనిపై వివరణ కోరేందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన సీతంరాజు సుధాకర్ దృష్టికి తీసుకు వెళ్లినా,

మొక్కుబడిగా ఆయన హామీ ఇవ్వడంతో, ఈ రాష్ట్రంలో కశ్యప స్కీం కూడా పూర్తిగా చేట్టేక్కేస్తుంది అని ఆందోళన ఏర్పడింది. 

ఒక ఇంట్లో రెండు పెన్షన్లు ఉండకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే. .బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు ఎందుకు అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన

బ్రాహ్మణ సంఘం నేత ఒకరు ఈ అంశం పై బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఇదీ వీరు చేస్తున్న అభియోగాల ప్రకారం, మంత్రులు, ఎమ్మెల్యే లకే ముఖ్యమంత్రి అప్పోయింట్మెంట్ దొరకడం లేదు, ఇక బ్రాహ్మణ కార్పొరేషన్ ప్రతినిధులకు ఎలా దొరుకుతుందో తెలియదు అనే ప్రశ్నలు వస్తున్నాయి. 

ఒక ఇంట్లో బ్రాహ్మణ కాశ్యప

స్కీం ద్వారా ఒకరు భృతి అందుకుంటే. .అదే ఇంట్లో, మరొకరు ప్రభుత్వం నుంచి ఒంటరి మహిళా లేదా, వితంతు పెన్షన్ అందుకుంటుంటే. . ప్రస్తుతం ఈ రెండు పెన్షన్ ల లో ఒక్కరికి  మాత్రమే భృతి ఇస్తామంటూ ప్రకటన విడుదలైంది. దీంతో కొన్ని ఇళ్లల్లో 70  ఏళ్ళు దాటినా వాళ్లకి ఇదొక్కటే ఆధారం.
 
ఎంతోకొంత మేలు జరుగుతోంది అని కూడా కొన్ని

కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు వల్ల తెలుస్తోంది. అది అన్నిట్లో కూడా ఉండాలి. ఒక్కరంటే ఒక్కరికి కూడా బాధ కలకుండా ప్రజాప్రతినిధులు చూసుకోవాలి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam