DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా లో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం : మంత్రి గంటా 


విశాఖపట్నం, జులై 30 , 2018 (DNS Online ):  à°µà°¿à°­à°•à±à°¤ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో క్రీడారంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి à°—à°‚à°Ÿà°¾

శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం నగరం లోని స్వర్ణభారతి ఇండోర్ మైదానంలో జరుగుతున్నా ప్రో మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలను అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన

మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ గాండీవం అనే కార్యక్రమాన్ని పాఠశాలల స్థాయి నుంచే మొదలు పెట్టిందన్నారు. రానున్న కాలం లో ఆంధ్ర ప్రదేశ్ లో

ఒలింపిక్స్ పోటీలు నిర్వహించగలిగే స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ ను తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. గత ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్

పోటీల్లో రజత పతాకం సాధించిన పివి సింధుకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వడం తో పాటు అకాడమీ ఏర్పాటుకు స్థలాన్ని కూడా ఇచ్చామన్నారు. అదే విధంగా పాఠశాల

విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధిస్తే వారికి అకడమిక్ పరీక్షల్లో గ్రెస్ మార్కులు కూడా అందిస్తున్నామన్నారు. విశాఖపట్నం శివారు

ప్రాంతమైన అగనంపుడి లో 150 ఎకరాల విస్తీర్ణం లో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్ కట్టేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఏ స్థాయి క్రీడా

పోటీలనైనా అక్కడ నిర్వహించుకునేలా రూపుదిద్దుకుంటోందన్నారు. ఈ కార్యక్రమం లో డాక్టర్ ఎస్ ఏ రెహమాన్, విద్యాధర్, తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు

చెందిక అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు విశాఖ నగరం లోని స్వర్ణభారతి ఇండోర్ మైదానం లో ఉదయం నుంచి జరుగుతున్నాయన్నారు. ఈ

పోటీలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం కార్యక్రమం లో పాల్గొని, క్రీడలను ప్రారంభించారు 

 

#dns #dns news #vizag #visakhapatnam #badminton #pro masters

#badminton league #dns media #sports #swarnabharati  #ganta #andhra pradesh #government #pro masters badminton league

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam