DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం ఈఓ సూర్యకళ మాతృసంస్థ కు వెళ్ళిపోతున్నారా?

*నాడు భ్రమరాంబ - నేడు సూర్యకళ, పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గలేకేనా?*

*సింహగిరి పై ఈఓ పోస్ట్ కత్తిమీద సాములాంటిదేనా?*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 30, 2021 (డిఎన్ఎస్):* ప్రముఖ శ్రీవైష్ణవ క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవి సూర్య కళ ఈ పదవి

నుంచి తప్పుకుని తిరిగి తన మాతృ సంస్థ రెవెన్యూ విభాగానికి వీళ్ళిపోతున్నారా? అంటే అవుననే సంకేతాలు కనపడుతున్నాయి. గత కొంత కాలంగా ఆలయంలో పలు మార్పులు, సంస్కరణలను ప్రవేశ పెట్టి భక్తులు మన్ననలు పొందిన ఆమె, ప్రభుత్వం లోని ముగ్గురు పెద్దల నుంచి వస్తున్నా ఒత్తిళ్లను తట్టుకోలేకే ఈ పదవి నుంచి వైదొలిగేందుకు

మొగ్గుచూపుతున్నట్టు ఆలయ వర్గాలే తెలియచేస్తున్నాయి. 
ప్రధానంగా ఆలయ అభివృద్ధి లో తీసుకోవాల్సిన ప్రతి పనికి ఆలయ చైర్మన్ అనుమతి తప్పని సరి. అయితే ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న పూసపాటి అశోక్ గజపతి ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి కావడం తో అధికార పార్టీకి చెందిన ఇద్దరు పెద్దల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భయం

ప్రత్యక్షంగా కనపడుతోంది. ఆలయ అనువంశిక వంశస్తులు కావడంతో అశోక్ తన అనుమతి, ప్రమేయం లేకుండానే ఆలయంలో పనులు జరుగుతున్నాయంటూ న్యాయ స్థాయిని తెలియచేయడం తో ప్రభుత్వానికి, ఆలయ ఈఓ కి కోర్టు మొట్టికాయలు వేసింది. ఆ తర్వాత ఈఓ చైర్మన్ కు ఆలయ vishayalu తెలియచేయడం జరుగుతోంది. 
ఈ నేపథ్యంలో పాలక పక్షానికి చెందిన ఇద్దరు నేతలు, ఈమెపై

తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు సమాచారం. ప్రతి అంశాన్ని తమ దృష్టికి తేవాలని, చైర్మన్ తో సంప్రదింపులు వ్యతిరేకించడం తో ఇరు వర్గాల నుంచి ఈఓ కు తలనొప్పులు ఎదురవడంతో, మానసిక ప్రశాంతత కోసం ఈ పదవిని సైతం వదులుకునేందుకు ఆమె సిద్దపడినట్టు తెలుస్తోంది. ఇప్పడికే అధికారులకు తనను మాతృ సంస్థ కు బదిలీ చెయ్యాలి అంటూ లేఖ సైతం

వ్రాసారు అంటూ ఆలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  దీనిలో భాగంగానే విజయవాడ వెళ్ళి నేరుగా ఉన్నతాధికారుల వద్దే ఈ విషయాన్నీ పరిష్కరించాలని మంగళవారం ఆమె రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్తున్నట్టు సమాచారం. 

గతంలోనూ ఇదే ఆలయ ఈఓ గా పనిచేసిన డి. భ్రమరాంబ సైతం ఇక్కడ ఒత్తిళ్లను తట్టుకోలేక తనను బదిలీ చెయ్యాలంటూ

ఉన్నతాధికారులకు లేఖ వ్రాసి, వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. 

నాడు భ్రమరాంబ, , , నేడు సూర్యకళ. . . సింహాచలం ఆలయంలో ఈఓ లు పూర్తికాలం పనిచేసే పరిస్థితులు లేవా?

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam