DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నగర కొత్వాల్ గా మహేష్ లడ్డా భాద్యతల స్వీకరణ 

విశాఖపట్నం, జులై 30 , 2018 (DNS Online ) : విశాఖ పోలీసు కమిషనరుగా మహేష్ చంద్ర లడ్డా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం à°Ÿà°¿. యోగానంద్ నుంచి అయన భాద్యతలను స్వీకరించారు. 1998 బ్యాచ్‌

ఐపీఎస్‌ à°•à°¿ చెందిన మహేష్‌చంద్ర లడ్డా  à°µà°¿à°¶à°¾à°–పట్నం జిల్లా చింతపల్లి ఏఎస్పీగా  à°µà°¿à°§à°¿ నిర్వహణను ప్రారంభించారు. ఇక్కడ రెండేళ్లు పని చేసి, అందరి మన్ననలు పొందారు.

అనంతరం మహబూబ్‌నగర్‌ ( తెలంగాణ ) జిల్లా ఓఎస్‌డీగా రెండేళ్లు కాలం పనిచేసి తదుపరి  à°ªà±à°°à°•à°¾à°¶à°‚ జిల్లా ఎస్పీగా ఏడాదిన్నర కాలం పని చేసారు. నిజామాబాద్‌ ( తెలంగాణ )

ఎస్పీగా ఏడాదిన్నర, గుంటూరు జిల్లా ఎస్పీగా రెండేళ్లు, గ్రేహౌండ్స్‌ విభాగం, వరంగల్‌ ( తెలంగాణ ) పీటీసీలో, హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా కొన్నాళ్లు విధులు

నిర్వహించారు. జాతీయ దర్యాప్తు సంస్థలో రెండున్నరేళ్లు. సీఆర్‌పీఎఫ్‌ డీఐజీ. విజయవాడ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌à°—à°¾ పని చేశారు . 2012లో డీఐజీ, 2016లో ఐజీగా పదోన్నతి

పొందారు . విధి నిర్వహణలో ధైర్యశాలిగా గుర్తింపు పొందారు. ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పని చేసినపుడు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. దానికి ప్రతీకారంగా వారు

ఆయనపై మెరుపుదాడి చేశారు. à°† సమయంలో ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. à°ˆ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఆయనకు కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. బుల్లెట్‌

ప్రూఫ్‌ వాహనాలను కేటాయించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.à°Ž.)లో చేసినపుడు కీలక కేసుల దర్యాప్తులో భాగస్వాములయ్యారు. విశాఖ నగర నూతన పోలీస్ కమిషనర్ à°—à°¾ విధులను

స్వీకరించిన అనంతరం జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 

 

#dns #dns news #vizag #visakhapatnam #police #police commissioner #cp #government  #vijayawada #warangal #mahaboobnagar #guntur #prakasham #telangana

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam