DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బొమ్మన రాజ్ కుమార్ కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాం

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 01, 2021 (డిఎన్ఎస్):* రాజమండ్రి కి చెందిన వస్త్ర వ్యాపారి, జాంపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ దివంగత వైఎస్ఆర్ సీపీ నాయకులు బొమ్మన రాజ్ కుమార్ కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని పార్టీ ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జి తిరుమల తిరుపతి

దేవస్థానం చైర్మన్, వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తాడితోట మహాత్మాగాంధీ హోల్ సేల్ క్లాత్ మార్కెట్ లో ది- జాంపేట కో ఆపరేటివ్  ఆర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బోమ్మన రాజ్ కుమార్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బొమ్మన 2014 లో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ

చేసి ఓడిపోయినా సంవత్సరాలుగా పార్టీకి విశేష సేవలు అందించారని అన్నారు. అయన చేసిన సేవలకు గుర్తింపుగా కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని అన్నారు.

కార్యక్రమం లో రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే

జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam