DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వీధుల్లో వినాయకచవితికి అనుమతి లేదు: గుంటూరు ఎస్పీ  

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 02, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు ఈ నెల 10 న రానున్నవినాయక చవితి పండుగ సందర్భంగా బహిరంగ వేడుకలు జరుపుకోడానికి అనుమతి లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఓ ప్రకటనలో తెలియచేసారు. ఈ సందర్బంగా అర్బన్ పరిధిలో ప్రజలు పాటించ

వలసిన సూచనలను తెలియ జేసినారు. అవి ఇవే:

1 . ప్రస్తుతము కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాధి  వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని, వినాయక చవితి పండుగను ప్రజలు తమ తమ ఇండ్లలోనే నిర్వహించు కోవలసినది. 

2 .ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బహిరంగంగా వీధులలో, ఇతర ప్రదేశాలలో పెద్ద పెద్ద విగ్రహాలు ఏర్పాటు చేసి, పందిర్లు

వేసి భారీ ఎత్తున ప్రజలు గుంపులు గుంపులుగా  డీజే లు డప్పు విన్యాసాలు ఉత్సవాలు  నిర్వహించుటకు పోలీస్ పర్మిషన్ లేదు.

3 . వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణాన్ని  పరిరక్షించుటకు మట్టి వినాయకుని ప్రతిమలతో తమ తమ ఇండ్లలోనే గణపతి పూజా మహోత్సవాలను నిర్వహించు కోవాలని తెలిపారు.

4 . అదేవిధంగా తమ తమ

గృహాల్లోని వినాయక ప్రతిమలను పండుగ జరుపుకొని కుటుంబ సభ్యులతో నిమజ్జనాలు చేసుకోవాలని తెలియ జేశారు

Covid-19 కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే దానిలో భాగంగా, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా, పరిసరాల పరిశుభ్రతను గూడా పాటిస్తూ, తరచుగా శానిటేషన్ చేస్తూ కరోనా వైరస్

 మహమ్మారిని పారద్రోలాలని గుంటూరు అర్బన్ ఎస్పి ఆరిఫ్ హఫీజ్ సూచించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam