DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ పండగలకి మాత్రమే కోవిడ్ రూల్స్ వర్తిస్తాయా?

*హిందూ వ్యతిరేక ప్రభుత్వం జవాబు చెప్పాలి:బీజేపీ* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 02, 2021 (డిఎన్ఎస్):* కోవిడ్ నిబంధనలు కేవలం హిందువుల పండగలకు మాత్రమే వర్తిస్తాయా ? రాజకీయ పార్టీల మీటింగ్ లు, వర్ధంతులకి ఈ రూల్స్ లేవా అంటూ బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ సభ్యుడు విజయ్ ఫణి

మండిపడ్డారు. 
వీధుల్లో వినాయకచవితి వేడుకలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఈ అంశం పై కచ్చితంగా హిందూ సమాజానికి జవాబు చెప్పి తీరాలన్నారు. ఇతర మతాల వేడుకలకు ఎటువంటి రూల్స్ అడ్డురావని, మద్యం దుకాణాలు, సినిమాలు, ర్యాలీలు, రాజకీయ పార్టీల మీటింగ్

లకు, వాళ్ళ నేతల వర్ధంతులకి మందలు మందలు గా జనం ఆ సమీకరణ చేసినా ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకు పోయిందన్నారు.  వినాయక చవితి ఏంటో భక్తి శ్రద్దాలతో కలిసి  చేసుకునేది అని, దీనిలో భక్తులు క్రమశిక్షణతోనే  పాల్గొంటారు తప్ప, తాగి తందానాలు  ఆడరన్నారు. 

ఈ హిందూ వ్యతిరేక ప్రభుత్వం కచ్చితంగా జవాబు చెప్పి తీరాలన్నారు.

దీనికి ప్రజలే  గట్టిగా బుద్ది చెప్తారన్నారు. 
అంతకు ముందు హిందూ ధార్మిక సంఘాలు, ఇతర స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో కలిసి వెళ్లి విశాఖ నగర పోలిసి డిసిపి కి వినతి పత్రం ఇచ్చారు.   

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam