DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంప్రదాయ విరుద్ధంగా సింహాచలం గుళ్లో పూర్ణకుంభ స్వాగతం

*పూర్ణకుంభ స్వాగతం పలికిన ఈఓను సస్పెండ్ చేయాలి*  

*విహెచ్పి జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది మండిపాటు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 03, 2021 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో ఆగమ, ఆలయ సంప్రదాయాలను తుంగలోకి

తొక్కి వివాదాస్పద కార్యక్రమాలు చెయ్యడం ఆలయ అధికారులకు నిత్యకృత్యమైపోయింది. శుక్రవారం ఆలయ దర్శనానికి వచ్చిన ఎంపీ విజయ సాయి రెడ్డి కి పూర్ణకుంభ స్వాగతం పలకడాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా పరిగణించింది. 

దర్శనానికి వచ్చే ముందు రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రూ.300

(అతిశీఘ్రదర్శనం) టికెట్ తీసుకోవడం గమనార్హం.
అన్ని నిబంధనలు తెలిసిన ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ, స్వయంగా పూర్ణకుంభ స్వాగతం పలకడానికి అనుమతి ఎలా ఇచ్చిందన్నారు. ఈ దుశ్చర్యకు భాద్యుల్ని చేస్తూ ఆమెను తక్షణం ఈఓ భాద్యతలను సస్పెండ్ చెయ్యాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది  డిమాండ్

చేసారు. 

ఆలయ మర్యాదలు, సంప్రదాయాలు తెలిసిన బ్రాహ్మణా మహిళా అయి ఉండి కూడా, ఆలయ ఈఓ గా ఆలయంలో పూర్ణకుంభ స్వాగతం ఎవరికీ పలుకుతారో కూడా తెలిసి ఉన్నా అనుమతి ఎలా ఇచ్చారన్నారు. కేవలం ఆలయ అనువంశ ధర్మకర్తలు, పీఠాధిపతులు, దేశాధినేతలు, రాష్ట్ర అధినేతలు కు మాత్రమే పలకవలసిన పూర్ణకుంభ స్వాగతాన్ని ఒక ఎంపీ కి ఎలా

పలుకుతారన్నారు

ఇది కచ్చితంగా సింహాచల క్షేత్ర ఆలయ మర్యాదలకు భంగం కల్గించే అంశమని, ఆలయ సంప్రదాయాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కారన్నారు. దీనిపై భక్తులందరికీ మనస్థాపం కలుగుతోందన్నారు. దీనికి కచ్చితంగా ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. 

ఆలయం కు ఈమె ఈవోగా వచ్చిన తర్వాత వివాదాస్పద అంశాలు

అధికంగానే జరుగుతున్నాయన్నారు. ఇటీవలే ఒక అర్చకుని గరుడ గద్య ను వీడియో లో చిత్రీకరించి, అన్యమత పాటలతో మార్ఫింగ్ చేసిన ఘటన ఇంకా మరిచిపోక ముందే ఈమె ఇలా ఆలయ సంప్రదాయ విరుద్ధంగా  ఒక సాధారణ ఎంపీ కి ఇలా పూర్ణకుంభం పలకడం చేయరాని తప్పిదం అన్నారు. ఇదే ఆలయం లో ఏదేని తప్పు సాధారణ ఉద్యోగి చేస్తే. . తక్షణం చర్య తీసుకునే ఈమె పై

సస్పెన్షన్ వేటు వేయాల్సిందేనని విహెచ్పి డిమాండ్ చేస్తోందన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam