DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 న కళాభారతి లో సురభి శ్రీకృష్ణ రాయబారం నాటకం

*ఈ నెల 11 నుంచి కళాభారతి 35 వ వార్షికోత్సవాలు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 06, 2021 (డిఎన్ఎస్):* విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, కళాభారతి కళ సంస్థ 35 వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల  11 నుంచి ప్రారంభమవుతున్నట్టు  సంస్థ కార్యదర్శి గుమ్ములూరు రాంబాబు తెలిపారు. నిర్వహించిన

విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా అనేక సంగీత, సాహిత్య, నృత్య, నాటక, హరికథ  బుర్రకథ, తోలు బొమ్మలాట, ఇలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిరాటంకంగా నిర్వహిస్తూ వస్తోందన్నారు. 

గత 20 సంవత్సరాలుగా  "NATIONAL EMINENCE AWARD "జాతీయస్థాయి పురస్కారం " ప్రముఖ సంగీత విద్వాంసులకు "నాద విద్యా

భారతి", ప్రముఖ నృత్య  కళాకారులకు “ నాట్య విద్యా భారతి" తో  బిరుదుతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతి, 2. 50 లక్షలు విలువ చేసే స్వర్ణకమలం, నూతన వస్త్రాలు, ప్రశంసా పత్రం ఇచ్చి సత్కరిస్తున్నాది వీఎండీఏ  కళా భారతి సంస్థ.

2020 లో COVID విస్తృతంగా ఉండడంవల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదని, కోవిద్  కారణంగా బయట

రాష్ట్రాల నుంచి  రప్పించడం మంచిది కాదు కనుక 2021 ఈ సంవత్సరంలో కూడా అవార్డు ఫంక్షన్  జరపడం లేదన్నారు. 

కనీసము సంగీత, నృత్య, నాటక  కార్యక్రమాలు జరపాలని నిర్ణయించి కేవలం  స్థానిక జాతీయ స్థాయి కళాకారులచే ఏడు రోజుల కార్యక్రమాన్ని చేయడానికి ఏర్పాటు చేశామన్నారు.

ఈ 7 రోజుల ఉత్సవాల ఆహ్వాన పత్రికను

కళాభారతి కార్యదర్శి గుమ్ములూరి రాంబాబు, ట్రస్టీలు  డా. ఎస్. విజయకుమార్ , సుసర్ల రామ గోపాల్,  పైడా కృష్ణ ప్రసాద్, మల్లికా మనోజ్ గ్రంధి, విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్  కె. రామ మోహన్ రావు హాజరై ప్రారంభించనున్నారు. 

11.9.21. మొదటిరోజు ప్రారంభ సభ క్లుప్తంగా

జరుపుతూ తదుపరి కూచిపూడి నృత్య అంశాలను స్థానిక కూచిపూడి కళాక్షేత్రం గురువుగారు శ్రీ హరి రామ మూర్తి శిష్యులు ప్రదర్శన ఇవ్వనున్నారు. 
12.09.2021 రెండవ రోజు ఆదివారం స్థానికంగా ఉన్న A టాప్  గ్రేట్  కళాకారిణి శ్రీమతి మండా సుధారాణి గారి గాత్ర కచేరి,  
13.09.2021 మూడవరోజు శ్రీ మోదుమూడి సుధాకర్ A టాప్ గ్రేడ్ గాత్ర విద్వాంసులు

 కచేరి చేయనున్నారు. 
14.09.2021 నాలుగో రోజు  స్థానిక కళాకారిణి శ్రీమతి లలితా చంద్రశేఖర్ గాత్ర కచేరి ఉంటుంది. 
15.09.2021 ఐదో రోజు ప్రముఖ వయోలిన్ విధ్వాంసులు శ్రీ ఎం ఎస్ ఎన్ మూర్తి గారు వయోలిన్ పై చక్కటి కచేరీ చేయనున్నారు. 
16.09.2021 ఆరో రోజు విశ్రాంత ఆచార్య డాక్టర్ మండపాక శారద గాత్ర కచేరీ ఉంటుంది. 

ఆఖరి రోజున

అంటే 17వ తారీఖున ప్రముఖ పౌరాణిక రంగస్థల నాటక  ప్రావీణ్యులు, 27 బంగారు నందుల గ్రహీత శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ రావు, హైదరాబాద్, వారి బృందంచే ప్రముఖ పౌరాణిక పద్య నాటకం “శ్రీకృష్ణ రాయబారం” చక్కటి సెట్టింగులతో సురభి వారి అనేక జిమ్మిక్కు లతో ప్రదర్శితమవుతుంది. 

ప్రేక్షకులకు అందరికీ ముఖ్య మనవి. :

నో

మాస్ నో ఎంట్రీ. ప్రతి ఒక్కరూ మాస్కు పెట్టుకొనే  ఉండాలని, సీటు విడిచి సీట్లలో మాత్రమే కూర్చోవాలి,  సామాజిక దూరం పాటించాలని, చేతులు సానిటైప్ చేసుకోవాలని, కోవిద్ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam