DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు రాష్ట్రాలకు తెగులు పట్టింది : వి హెచ్ పి 

విశాఖపట్నం, జులై 31 , 2018 (DNS Online ): ఉభయ తెలుగు రాష్ట్రాలకు హిందూ ధర్మం పట్ల ద్వేషం అనే తెగులు పట్టిందని విశ్వ హిందూ పరిషత్ విశాఖ ప్రాంత ఉపాధ్యక్షులు T. S. రవి కుమార్

మండిపడ్డారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాము సెక్యులర్ అని చెబుతూ హిందువులపైన, హిందూ సంస్థలపైన, ధర్మాచార్యులపైన దాడులు చేస్తూ, అవమాన పరుస్తు, చేయరాని

తప్పిదాలు చేసుకుంటూ పోతున్నారన్నారు. ఒక ఇరవై నిమిషాల సమయం ఇస్తే హిందువులను దేశంలోనే లేకుండా చేస్తానన్న అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ నుండి బహిష్కరించడం

చేతగాని తెలంగాణా ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతి హిందూ సమాజానికి చేయరాని ద్రోహం చేశాడన్నారు. దీనికి అదనంగా ఒక తుచ్ఛుడు శ్రీరాముని

గురించి నోటికి వచ్చిన ప్రేలాపనలు చేయడాన్ని తప్పు అని చెప్పిన పాపానికి శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ను జంట నగరాల నుంచి బహిష్కరణ చేసిన తప్పిదానికి తగిన

శిక్ష అనుభవించాల్సిదేనన్నారు. ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి హిందూద్వేశాన్ని బహిరంగంగానే

బయటపెట్టుకున్న హేతువాది అని మండిపడ్డారు. నూతన రాధానికి కూడా వేటు దూరంలోని విజయవాడ నగరంలో సుమారు 40 కి పైగా హిందూ ఆలయాలను రాత్రి కి రాత్రి కూల్చివేసి రాక్షస

ఆనందాన్ని పొందినవాడన్నారు. పైగా దీన్ని అడ్డుకున్న విహెచ్ పి, బీజేపీ పై అవాకులు చెవాకులు సంధించిన ఘనులు తెలుగుదేశం నేతలు అన్నారు. హిందూ దేవాలయాలను మీ

అధీనంలో పెట్టుకుని, తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఒక క్రైస్తవుణ్ణి నియమించడం ద్వారా హిందువుల పట్ల తమ ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేశారన్నారు. ఇతని

లోపాలను ఎట్టి చూపించిన  à°¶à°¿à°µà°¸à±à°µà°¾à°®à°¿à°¨à°¿ నిర్భంధించిన ఘనుడు బాబేనన్నారు. à°’à°• లౌకిక రాజ్యంలో కేవలం హిందువుల ఆలయాలపై మీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. దేవాదాయ శాఖను

నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వమే హిందూ దేవాలయాలను కూల్చివేస్తే. . . .ఇక ప్రభుత్వం ఎందుకున్నట్టు అని ఎద్దేవా చేశారు. 
 à°‰à°­à°¯ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు హిందువుల

మనో భావాలను దెబ్బతీస్తూనే ఉన్నాయి. తెలంగాణా లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు చేసే రాజకీయ యాత్రలకు అనుమతులు ఇస్తూ హిందూ దేవీ దేవతలను అవమానిస్తూ, హేళనచేస్తున్న

వ్యక్తులను కఠినంగా శిక్షించకుండా దీనిని నిరసిస్తూ ధర్మయాత్ర చేస్తానన్న పూజ్య పరిపూర్ణానంద స్వామిని నిరోధిస్తారా? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్, జనసేన రాజకీయ

యాత్రలకు అనుమతులు ఇస్తూ పూజ్య శివస్వామి తిరుమల పవిత్రతను కాపాడాలని, తిరుమలలో జరుగుచున్న పరిస్థితులు హిందువుల ముందు ఉంచాలని పాదయాత్ర చేస్తానంటే వారి

మాత్రను అడ్డుకుని, ఇతర స్వామీజీలను గృహ నిర్భందం చేస్తారా? భద్రాచలం, ఒంటిమిట్ట రామాలయాలను నిర్వహించే రెండు తెలుగు రాష్ట్రాల ఎండోమెంట్ శాఖలు రాముని

నిందించిన వ్యక్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకో పోగా తిరిగి హిందువులపైన, ధర్మాచార్యుల పైన చర్యలు తీసుకుంటారా? మీచర్యలద్వారా మీ ప్రభుత్వాలు హిందూ

వ్యతిరేకతతో ఉన్నాయని హిందూ సమాజానికి స్పష్టంగా అర్ధమయింది. మీకు హిందువుల హుండీ డబ్బులే కావాలి కానీ హిందువుల మనోభావాలు అక్కరలేదు. ఇప్పటికైనా

ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబులు హిందువులకు బేషరతుగా క్షమార్పణలు చెప్పి పరిపూర్ణానంద స్వామి, శివస్వామిపైన అన్ని ఆంక్షలను తొలగించాలని వారిని కోరుతూ

అలా జరగని పక్షంలో రానున్న 2019 ఎన్నికలలో హిందువులు వీరి పార్టీలకు వ్యతిరేకంగా ఓటువేయాలని విశ్వహిందూ పరిషత్ ఉత్తరాంధ్ర శాఖ పిలుపునిస్తోంది... 


 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam