DNS Media | Latest News, Breaking News And Update In Telugu

10 లక్షల మందికి కోవిడ్ వాక్సిన్ లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విజయనగరం, సెప్టెంబర్ 11, 2021 (డిఎన్ఎస్):* విజయనగరం జిల్లా వ్యాప్తంగా శనివారం కోవిడ్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఏ. సూర్యకుమారి ఆదేశాల మేరకు శుక్రవారం నాడే 81 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 70 వేల డోస్ ల కోవిషీల్డ్, 10 వేల డోస్ ల కోవాగ్జిన్ నిల్వలు వైద్య ఆరోగ్య

శాఖ అధికారులు తరలించారు. దీనికై జిల్లా యంత్రాంగం ఉదయం 7 గంటల నుంచే వాక్సిన్ వేసుకో వలసిన వారిని గుర్తించి వాక్సినేషన్ కేంద్రాలకు తీసుకువస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఒక్క డోసు కూడా తీసుకోని 2,93,565 మంది వున్నట్టు గుర్తించారు. కోవిడ్ వాక్సిన్ తొలి డోస్ తీసుకొని రెండో డోసు వేయాల్సిన వారు 7,20,575 మంది వున్నట్టు

గుర్తించారు. మొత్తం 10,14,140 మందికి వాక్సిన్ వేసే లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహణ నిర్వహిస్తున్నారు.  

విజయనగరం రూరల్ మండలం ద్వారపూడి, చీపురుపల్లి మండలం, తెర్లాం మండలం లోని గ్రామాల్లో ఇళ్ల వద్దకే వైద్య ఆరోగ్య సిబ్బంది వెళ్లి వాక్సిన్ వేస్తున్నారు. బొండపల్లి గ్రామ సచివాలయం లోను వాక్సినేషన్ డ్రైవ్ లో

కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ డా ఆర్. మహేష్ కుమార్ లు నిరంతరం పర్యవేక్షిస్తూ క్షేత్ర స్థాయి అధికారులకు సూచనలు చేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam