DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాటతో రాజమహేంద్రి దేవీచౌక్ దసరా ఉత్సవాలు ఆరంభం

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, సెప్టెంబర్ 11, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే ఎంతో విశిష్టత ఉన్న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం దేవిచౌక్ దసరా ఉత్సవాలకు శాస్త్రోక్తంగా రాట తో వేడుకలు ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం లో రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా

పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ వేడుకలకు ఎంతో విశిష్టత ఉందని అందుకు అనుగుణంగానే ప్రతి ఏడాది ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. గత 88 సంవత్సరాల నుండి రాజమహేంద్రవరం దేవిచౌక్ లోని దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు.

గత సంవత్సరం కోవిడ్ కారణంగా పూర్తిగా నిబంధనలు

పాటిస్తూ దసరా ఉత్సవాలను జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారికి జరగాల్సిన పూజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని ఆలయ కమిటీకి ఆయన సూచించారు. 

ఆలయ కమిటీ ప్రెసిడెంట్ రాజేశ్వరరావు గారి హయాంలో గత ఏడాది దసరా ఉత్సవాలలో

ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు తలెత్తకుండా ఎంతో చక్కగా నిర్వహించడం జరిగిందన్నారు.  ఈ ఏడాది కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులతో దసరా ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలన్నారు.

బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులు కరుణాకటాక్షాలు రాజమహేంద్రవరం ప్రాంత పరిసరాల ప్రజలందరి మీద

ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు స్థానిక వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam