DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జివిఎంసి లో అవినీతి పై కౌన్సిల్లో చర్చించాలి :జనసేన

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 13, 2021 (డిఎన్ఎస్):* మహా విశాఖ నగర పాలక సంస్థ లో పేరుకు పోయిన అవినీతి అక్రమాలు తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలు రానున్నకొన్సిల్ సమావేశంలో చర్చించాలని జనసేన కార్పొరేటర్, జివిఎంసి పక్ష నాయకుడు పీతల గోవింద్ యాదవ్ విశాఖ నగర మేయర్ హరి కుమారి ని కోరారు. సోమవారం

ఆమెను కలిసి సెప్టెంబర్ 18వ తేదీన జరిగే మహా విశాఖ నగర పాలక సంస్థ సమావేశంలో టౌన్ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో పేరుకు పోయిన అవినీతి అక్రమాలు తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలు పై చర్చ ఈ అంశాలను ఎజెండా లో చేర్చడం గురించి విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందించారు. 
మహా  విశాఖ నగర పాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ విభాగం,

రెవెన్యూ విభాగం అవినీతికి చిరునామాగా మారాయని పలు సందర్భాల్లో అధికార పార్టీ సభ్యులే తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ రెండు విభాగాల కారణంగా నగరపాలక సంస్థ చెడ్డపేరు రావడంతో పాటు వందల కోట్ల అవినీతి, అద్దె బకాయిలతో  సకాలంలో పన్నులు చెల్లించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు

విభాగాలను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టౌన్ ప్లానింగ్ లో తీసుకురావాల్సిన మార్పులు ,సవరణలు, దిద్దుబాటు చర్యలు పై ఆగస్ట్ 23 వ తేదీన పూర్తి వివరాలతో మీకు లేఖ రాయడం జరిగింది. అదే  విధంగా కోట్ల రూపాయల  అద్దె, ఆశీలు బకాయిలతో సతమతమవుతున్న రెవెన్యూ విభాగం  పని తీరు పైన, కళ్యాణ మండపాలు ఇతర వాణిజ్య సముదాయాల అద్దెలు

వసూలునకు  తీసుకోవాల్సిన చర్యలపై న సెప్టెంబర్ ఆరో తేదీన మరో లేఖ  అందించడం జరిగింది. ఈ రెండింటిని పరిశీలించి ఈ రెండు అంశాలను అత్యవసరమైనవిగా భావించి 18వ తేదీ నాటికి కౌన్సిల్ సమావేశం ఎజెండాలో వీటికి స్థానం కల్పించాలని కోరుతున్నాను. అవినీతికి ఆలవాలమైన టౌన్ ప్లానింగ్ పైన, 70 కోట్లకు పైగా అద్దె బకాయిలను వసూలు చేయని

రెవిన్యూ శాఖ పైన పూర్తి వివరాలతో రాసిన లేఖలను జత  చేస్తున్నాను. ఆదాయం లేదన్న సాకుతో విశాఖ నగర ప్రజలపై ఇంటి పన్ను భారం,  కొత్తగా చెత్త భారం విధించిన సమయంలో  రావాల్సిన అద్దెలను  సకాలంలో వసూలు చేయకపోవడం వల్ల సంస్థకు వందల కోట్ల నష్టం వాటిల్లుతుంది.  కొత్తగా పన్నులు విధించి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు

చేస్తున్న  నగరపాలక సంస్థ కోట్ల రూపాయల అద్దె బకాయిలను వదిలేయడం బాధ్యతారాహిత్యమే.  మరో పక్కకోట్ల రూపాయల  టౌన్ ప్లానింగ్   ఆదాయం లంచాల రూపంలో పక్కదారి పడుతుంది ఈ రెంటినీ పరిశీలించి తగు విధమైన చర్యలు తీసుకొని నగరపాలక సంస్థను పటిష్ట పరచడానికి మీ వంతు సహాయ సహకారాలు అందించగలరు అని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam