DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హృద్యంగా సాగుతున్న కళాభారతి వార్షికోత్సవ సంగీత కచేరీలు

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 13, 2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం లోని కళాభారతిలో జరుగుతున్న విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, కళాభారతి 35 వ వార్షికోత్సవ సందర్భంగా ఏడురోజుల సంగీత, నృత్య, నాటక ఉత్సవాలలో రెండవ రోజు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు టాప్ గ్రేడ్ కళాకారిణి సునాధ సుధానిధి మండా

సుధారాణి .గాత్ర కచేరి జరిగింది.  
తొలుత వాంఛ తోను - కర్ణరంజని రాగం - లో ముత్తయ్య భాగవతార్  (రచన)  పాడి అద్భుతంగా ప్రారంభం చేశారు. తర్వాత ."మారవైరి రమణి-" నాసికాభూషణి రాగం- త్యాగరాజ కృతి   రాగాలాపన అత్యున్నత స్థాయిలో చేసి శ్రోతల కరతాళధ్వనులను అందుకున్నారు. శ్యామ శాస్త్రి రచించిన "మా యమ్మ" అమ్మవారి మీద ఆహిరి

రాగం లో పాడి అమ్మవారిని సాక్షాత్కరిం పజేశారు.

కృతి భైరవి రాగంలో శేష అయ్యర్  రచించిన " ఇక నన్ను బ్రోవ కున్న " రాగాలాపన, స్వరకల్పన, నెరవు అద్భుతంగా వేసి శ్రోతలన సంగీత సాగరంలో ముంచి వేశారు. దండము పెట్టేను రా - బలహంస రాగం - త్యాగరాజ కీర్తన.  "నామ శ్రవణ సుఖం-" యమునా కల్యాణి - తులసీవనం కీర్తన. చివరగా కాపీ

రాగంలో థిల్లాన పాడి శ్రోతల కరతాళ ధ్వనులతోహాలు మారుమ్రోగిపోయింది. 

మండా సుధారాణి కి సహకార గానం ఎస్. విష్ణు ప్రియ శ్రావ్యంగా అందించారు. వీరికి వయోలిన్ పై హెచ్. రామచరణ్ చాలా దీటుగా సహకారాన్ని అందించి కచేరీ స్థాయిని పెంచారు. మృదంగం పై ఆకాశవాణి సీనియర్ కళాకారుడు ధన్వాడ ధర్మారావు, మోర్సింగ్ పై వెంకటేష్

అద్భుతంగా వాయిద్య సహకారాన్ని అందించారు. 
చివరగా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ శ్రోతలందరినీ కోవిద్ నిబంధనలు పాటిస్తు నందుకు ప్రశంసిస్తూ ఇలాగే ప్రతి రోజు ఉండాలని మరొకసారి కోరారు. 

కార్యక్రమాన్ని కళాభారతి అధ్యక్షులు ఎం.ఎస్.ఎం. రాజు, కార్యదర్శి గుమ్ములూరు రాంబాబు, ముఖ్య అతిధి డాక్టర్ సూరపనేని విజయ్

కుమార్, ఎస్ రామ్ గోపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam